Mrunal Thakur Comments : బాడీ షేమింగ్ పై స్పందించిన ‘జెర్సీ’ హీరోయిన్ మృణాల్‌ ఠాకూర్‌.. అలా పిలిచేవారంట!

Published : Apr 24, 2022, 01:51 PM IST

తెలుగు రీమేక్ ‘జెర్సీ’ మూవీ హీరోయిన్ మృణాల్‌ ఠాకూర్‌ (Mrunal Thakur) తాజాగా బాడీ షేమింగ్ పై స్పందించింది. తన శరీరాకృతి బట్టి చాలా మంది బాధాకరంగా విమర్శించే వారని తెలిపింది. 

PREV
16
Mrunal Thakur Comments : బాడీ షేమింగ్ పై స్పందించిన ‘జెర్సీ’ హీరోయిన్ మృణాల్‌ ఠాకూర్‌.. అలా పిలిచేవారంట!

ముంబైకి చెందిన బాలీవుడ్ హీరోయిన్ మృణాల్‌ ఠాకూర్‌ ప్రస్తుతం నార్త్ లో వరుస సినిమాలతో ఆడియెన్స్ ను అలరిస్తోంది. తన 2014లో మరాఠి సినిమాతో తెరంగేట్రం చేసిందీ సుందరి. ఆ తర్వాత బాలీవుడ్ బాట పట్టింది. తన గ్లామర్, నటనకు మంచి మార్కులే పడటంతో ఆఫర్లు  కూడా దక్కాయి. 
 

26

మృణాల్‌ ఠాకూర్‌ హిందీలో నటించిన తొలిచిత్రం ‘లవ్ సోనియ’ మంచి గుర్తింపును తెచ్చి పెట్టింది. ఆ తర్వాత ‘సూపర్ 30’  చిత్రంలో అవకాశం దక్కించుకుంది. అప్పటి నుంచి వరుస సినిమాలతో అలరిస్తోంది. ప్రస్తుతం బాలీవుడ్ లో బిజీయేస్ట్ హీరోయిన్ గా లైఫ్ లీడ్ చేస్తోంది.
 

36

అయితే, ఇండస్ట్రీకి వచ్చిన తొలినాళ్లో ఈ సుందరి కూడా బాడీ షేమింగ్ ను ఎదురుకున్నట్టు తెలిపింది. మొదట్లో కాస్త బరువుగా ఉండటంతో తగ్గేందుకు  ప్రయత్నించిందట. దీంతో బరువు తగ్గుతున్న కొద్దీ తన ముఖం చిన్నగా అయిపోయిందని, ఆ తర్వాత శరీరం పై భాగం, ఆ తర్వాత కింది భాగం సన్నగా అవుతూ వచ్చిందని తెలిపారు. 
 

46

ప్రస్తుతం ఇప్పుడలానే ఉన్నానని అన్నారు. అయితే తన శరీరాకృతిని చూసి చాలామంది కుండ(మట్కా)లా ఉన్నావు అనేవారని కాస్తా తెలియజేసింది. దీంతో తనకు చాలా బాధగా ఉండేదన్నారు. నటిగా ఫిట్‌గా ఉండటం అత్యవసరం అనిపించి..  చాలా ప్రయత్నాలు చేసినట్టు తెలిపారు. 
 

56

ఓసారి అమెరికా వెళ్లినప్పుడు చాలామంది తనను ఇండియన్‌ కర్దాషియన్‌ అని పిలిచారంట. తనలాంటి శరీర సౌష్ఠవం కోసం డబ్బులు ఖర్చు చేస్తున్నారని తెలిసి ధైర్యం వచ్చిందని తెలిపారు. అప్పటి నుంచే తన ఫొటోలను సోషల్‌ మీడియాలో అభిమానులతో పంచుకుంటున్నట్టు తెలిపింది. 
 

66

2019లో నేచురల్ ష్టార్ నాని (Nani) నటించిన ‘జెర్సీ’మూవీని హిందీలో షాహీద్ కపూర్ (Shahid Kapoor)తో రీమేక్ చేసిన విషయం తెలిసిందే. హిందీ జెర్సీ (Jersey)లో షాహిద్ కపూర్ సరసన మృణాల్‌ ఠాకూర్‌ చక్కగా నటించింది. ఈ చిత్రం ఏప్రిల్ 22 నుంచి సక్సస్ ఫుల్ గా థియేటర్లలో రన్ అవుతోంది.

Read more Photos on
click me!

Recommended Stories