Karthika Deepam: జ్వాలాని పొగిడిన నిరుపమ్.. బాధతో కుమిలిపోతున్న హిమ..?

Published : Apr 07, 2022, 07:59 AM ISTUpdated : Apr 07, 2022, 08:28 AM IST

Karthika Deepam: తెలుగు బుల్లితెర పై ప్రసారం అవుతున్న కార్తీకదీపం(karthika deepam)సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం..  

PREV
16
Karthika Deepam: జ్వాలాని పొగిడిన నిరుపమ్.. బాధతో కుమిలిపోతున్న హిమ..?

ఇంద్రమ్మ దంపతులు జ్వాలా(jwala)నీ చీరలో చూసి జ్వాలా ని తెగ పొగిడేస్తూ ఉంటారు. జ్వాలా కి తెలియకుండా ఇంద్రమ్మ(indramma) దంపతులు పెళ్లి చూపులు ఏర్పాటు చేయాలని చూస్తారు. పెళ్లి చూపుల విషయం చెప్పడానికి ఇందిరమ్మ దంపతులు జ్వాలా దగ్గర తడబడుతూ ఉంటారు.
 

26

మరొకవైపు  హిమ,(hima) నిరుపమ్ బస్తీలో మెడికల్ క్యాంపు ఏర్పాటు చేసి అందరికీ ఉచితంగా వైద్యాన్ని చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే హిమ వారణాసి వాళ్ళ గురించి అందరిని అడుగుతు ఉంటుంది. ఇంతలో అక్కడికి ప్రేమ్,(pream)సత్య ఇద్దరు వస్తారు. అప్పుడు ప్రేమ్, హిమ వైపు చూస్తూ ప్రేమగా మాట్లాడతాడు.

36

మరొకవైపు ఆనందరావు, (anandrao)కూతురు స్వప్న ఇంటికి వెళ్తాడు. ఆనందరావు ని చూసిన స్వప్న చిరునవ్వుతో వెళ్లి పలకరిస్తుంది. నువ్వొక్కడివే వచ్చావా డాడీ లేక ఇంకా ఎవరైనా వచ్చారా అని అడగగా, లేదు స్వప్న (swapna)అని అనడంతో సరే పద అని ఇద్దరూ లోపలికి వెళ్తారు.అలా కొద్దిసేపు ఆనంద్ రావ్, స్వప్న లు మాట్లాడుకుంటూ ఉంటారు.
 

46

అప్పుడు ఆనందరావు స్వప్న ఫ్యామిలీ గురించి వాళ్ళు నీ కలపడం గురించి మాట్లాడగా ఇవన్నీ మీ ఆవిడ చెప్పి పంపించిందా డాడీ అంటూ ఆనందరావు మాటలతో దెప్పి పొడుస్తుంది స్వప్న(swapna). మరొకవైపు ప్రేమ్(pream) మెడికల్ క్యాంపు లో హిమ కు ఫొటోస్ తీస్తూ ఉంటాడు. ఇంతలో సౌర్య ఆటోలో వస్తుంది.
 

56

జ్వాలా ని చీరలో చూసి ప్రేమ్(pream) షాక్ అవుతాడు. అప్పుడు జ్వాలా కెమెరా లాక్కునే ప్రయత్నం చేయగా కింద పడిపోతుండగా అప్పుడు ప్రేమ్ పడిపోకుండా పట్టుకొన్నట్లే పట్టుకొని వదిలేస్తాడు. ఇక సౌర్య ని చీరలో చూసి హిమ(hima),నిరుపమ్ ఒక్కసారిగా స్టన్ అవుతారు.

66

చీరలో చాలా బాగున్నావు జ్వాలా(jwala)అంటూ నిరుపమ్ పొగడడం తో జ్వాలా మురిసిపోతూ ఉంటుంది. ఆ తరువాత హిమ, జ్వాలా చేతి పై ఉన్న పచ్చబొట్టును చూసి జ్వాల,సౌర్య(sourya)ఇద్దరు ఒకటేనా అని అనుకుంటూ ఉంటుంది. ఇక రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి.

click me!

Recommended Stories