`హాయ్‌ నాన్న` స్టోరీ లీక్‌.. నానికి రెండు సార్లు బ్యాడ్‌ ఎక్స్ పీరియెన్స్.. ?

Published : Dec 04, 2023, 09:02 PM IST

నాని, మృణాల్‌ ఠాకూర్‌ జంటగా నటించిన `హాయ్‌ నాన్న` విడుదలకు సిద్దమయ్యింది. అయితే ఈ మూవీ స్టోరీ బయటకు వచ్చింది. కథ ఇదే అంటూ నెట్టింట చక్కర్లు కొడుతుంది.   

PREV
16
`హాయ్‌ నాన్న` స్టోరీ లీక్‌.. నానికి రెండు సార్లు బ్యాడ్‌ ఎక్స్ పీరియెన్స్.. ?

`దసరా` వంటి మాస్‌ ఎంటర్‌టైనర్‌ తర్వాత నాని మళ్లీ తన కంఫర్ట్‌ జోన్‌ అయిన `హాయ్‌ నాన్న` చిత్రంలో నటిస్తున్నారు. నూతన దర్శకుడు శౌర్యువ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మృణాల్‌ ఠాకూర్‌ హీరోయిన్‌గా చేసింది. శృతి హాసన్ కీలక పాత్రలో కనిపించబోతుంది. ఈ మూవీ మరో మూడు రోజుల్లో ఆడియెన్స్ ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. నాని నయా ప్రమోషన్స్ తో దూసుకుపోతున్నారు. ఓ వైపు `యానిమల్‌` డైరెక్టర్‌తో ఇంటర్వ్యూ చేశారు. అలాగే వెంకటేష్‌తోనూ చిట్‌చాట్‌ చేశారు. 
 

26

మరోవైపు ప్రమోషన్స్ టూర్స్ తిరుగుతూ బిజీగా ఉన్నారు. అలాగే నాని వరుసగా టెంపుల్స్ ని విజిట్‌ చేస్తూ ఆథ్యాత్మిక సేవలో బిజీగా ఉంటున్నారు. అయినా సినిమాకి హైప్‌ రావడం లేదు. ఎంతగా కష్టపడుతున్నా, ఈ సినిమాకి క్రేజ్‌ రాకపోవడం గమనార్హం. కావడం అది డీసెంట్‌ కంటెంట్‌ కావడం, నాని స్టయిల్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ కావడంతో ఆడియెన్స్ నుంచి పెద్దగా ఆసక్తి కనబరడం లేదు. సినిమా బాగుందంటే ఈ సినిమా పుంజుకునే అవకాశం ఉంటుంది.

36

ఈ నేపథ్యంలో `హాయ్‌ నాన్న` కథేంటనేది ఆసక్తికరంగా మారింది. కథ ఇదే అంటూ కొన్ని లీకింగ్‌ స్టోరీస్‌ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఇందులో నాని సెలబ్రిటీ ఫోటో గ్రాఫర్‌గా పనిచేస్తుంటాడు. శృతి హాసన్‌ ఓ హీరోయిన్‌. ఆమె కెరీర్‌ బిగినింగ్‌లో నానితో ట్రావెల్ అవుతుంది. ఇద్దరి మధ్య ప్రేమ ఏర్పడుతుంది. వీరిద్దరి ప్రేమకి గర్భవతి అవుతుంది శృతి. చిన్నారి జన్మిస్తుంది. అయితే ఈ ఇద్దరు కలిసి ఉండటానికి, పాప అడ్డు అవుతుంది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య గొడవలు అవుతాయి. శృతి నానిని వదిలేసి వెళ్తుంది. ఆమె స్టార్‌ హీరోయిన్‌ కావడంతో నానికి హ్యాండిస్తుంది. 
 

46

దీంతో ఆమెని మర్చిపోయి తన కూతురే ప్రపంచంగా బతుకుతుంటాడు నాని. తనకు తల్లి ఎవరో ఆ చిన్నారికి తెలియదు. ఇలా ఈ ఇద్దరు హ్యాపీగా జీవితం గడుపుతున్న క్రమంలో వీరి జీవితంలోకి మృణాల్‌ వస్తుంది. ఆమె మొదట స్ట్రేంజర్ గా పరిచయం అవుతుంది. తన కూతురితో స్నేహం చేస్తుంది. ఆమె ద్వారా నానికి పరిచయం అవుతుంది. నాని మొదట మృణాల్‌ని పెద్దగా పట్టించుకోడు. తన లైఫ్‌లో అమ్మాయిలకు స్థానం లేనట్టుగా వ్యవహరిస్తుంటారు.

56

కానీ మృణాల్‌ క్లోజ్‌ అవుతుంది. దీంతో మళ్లీ నాని, మృణాల్‌ ప్రేమలో పడతారు. కానీ చివరగా మరో ట్విస్ట్. అప్పటికే మృణాల్‌కి పెళ్లైపోతుంది. దీంతో నాని, మృణాల్‌ దూరం అవుతారు. అలా రెండు సార్లు లవ్‌ విషయంలో బ్యాడ్‌ ఎక్స్ పీరియెన్స్ ఫేస్‌ చేస్తాడు నాని. చివరికి మృణాల్, నాని కలిసిందా? శృతి హాసన్‌ పాత్ర ఏమైందనేది ఈ సినిమా కథ అని తెలుస్తుంది. 

66

కాకపోతే సినిమా చాలా ఎమోషనల్‌గా సాగుతుందట. ఓ వైపు తండ్రీ కూతుళ్ల సెంటిమెంట్‌, ఇద్దరి మధ్య ఎమోషన్స్,మరోవైపు రెండు సార్లు ప్రేమలో విఫలం కావడంతో నానిలోని ఎమోషన్స్ ఈ సినిమాకి ప్రధాన బలం అని తెలుస్తుంది.ఈ రెండు ఎమోషన్స్ ఆడియెన్స్ కి కనెక్ట్ అయ్యేదాన్ని బట్టి `హాయ్‌ నాన్న` సినిమా ఫలితం ఆధారపడి ఉంటుంది. ఇక ఈ మూవీ డిసెంబర్‌ 7న విడుదల కాబోతుంది. పాన్‌ ఇండియా మూవీగా ఇతర భాషల్లోనూ ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories