ఇక శృతి హాసన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. కమల హాసన్ వారసురాలిగా ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా ఎంటర్ అయిన శ్రుతి... తన సొంత ఇమేజ్ తో ఎదిగింది. తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకుంటూ స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్నారు. అంతే కాదు శృతి హాసన్ మంచి నటి..మంచి సింగర్ కూడా. ఒక రకంగా చెప్పాలంటే శృతికి నటనకంటే సింగింగ్ అంటేనే ఎక్కువ మక్కువ. ఆమె ఎంత చక్కగా పాటలు పాడతారో తెలియాలంటే... హే రామ్, ఈనాడు, లక్, ఓ మై ఫ్రెండ్, త్రీ , ఆగడు, రేసు గుర్రం, పులి సినిమాలతో శృతి పాడిన పాటులు వినాలి.