పదేళ్లుగా స్పోర్ట్స్ మాన్ తో రిలేషన్ లో ఉన్నా... రహస్య ప్రేమికుడిని పరిచయం చేసిన తాప్సీ


తాప్సి పన్ను తన ప్రియుడిని పరిచయం చేసింది. పదేళ్లుగా అతనితో రిలేషన్ లో ఉన్నట్లు క్లారిటీ ఇచ్చింది. తాప్సి రహస్య ప్రేమికుడి వివరాలు ఏమిటో చూద్దాం.. 
 

ఝమ్మందినాదం మూవీతో సిల్వర్ స్క్రీన్ కి పరిచయమైంది తాప్సీ పన్ను. ప్రభాస్ కి జంటగా నటించిన మిస్టర్ పర్ఫెక్ట్ మూవీతో హిట్ అందుకుంది. ఈ చిత్రంలో ఆమె సెకండ్ హీరోయిన్. వీర, దరువు, మొగుడు, గుండెల్లో గోదారి, షాడో... ఇలా పలు తెలుగు చిత్రాల్లో నటించింది. 

కొన్నాళ్లుగా ఆమె బాలీవుడ్ లో సెటిల్ అయ్యారు. వరుసగా హిందీ చిత్రాలు చేస్తుంది. లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు ఆమె కేర్ ఆఫ్ అడ్రస్ అయ్యారు. ఆమె నటించిన పింక్, బద్లా వంటి చిత్రాలు మంచి విజయం సాధించాయి. 
 


Pro Dancer

డంకీ చిత్రంలో షారుఖ్ ఖాన్ కి జంటగా ఛాన్స్ కొట్టేసింది. దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ తెరకెక్కించిన డంకీ ఓ మోస్తరు విజయాన్ని దక్కించుకుంది. తాప్సీ పన్ను నటనకు ప్రశంసలు దక్కాయి. ప్రస్తుతం పలు చిత్రాలతో తాప్సీ పన్ను బిజీగా ఉంది. 

Taapsee Pannu

36 ఏళ్ల తాప్సీ పన్ను మొదటిసారి ప్రియుడిని పరిచయం చేసింది. గత పదేళ్లుగా అతనితో రిలేషన్ లో ఉందట. డెన్మార్క్ బ్యాడ్మింటన్ ప్లేయర్ మాథిస్ బో ని తాప్సీ ప్రేమిస్తుందట. బాలీవుడ్ కి వచ్చిన కొత్తల్లో మాథిస్ బో తో పరిచయం ఏర్పడిందట. ఆ పరిచయం ప్రేమగా మారిందట. 

Taapsee Pannu

కాలం గడిచే కొద్దీ మాథిస్ బో బంధం బలపడుతూ వచ్చింది. ఇన్నేళ్లు ఆయన పక్కనే నేను ఉన్నాను. మాథిస్ తో రిలేషన్ సంతోషాన్ని ఇస్తుంది. మాథిస్ తో విడిపోవాలి, మరొకరిని ప్రేమించాలనే ఆలోచన రాలేదు. ప్రేమ పెళ్లి విషయంలో నాకు కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి. అందుకే ఈ విషయం బయటపెట్టలేదని తాప్సీ చెప్పుకొచ్చింది.

No Film Background


ప్రియాంక చోప్రా, ప్రీతి జింటా, శ్రియ శరన్ తో పాటు పలువురు హీరోయిన్స్ విదేశీయులను పెళ్లి చేసుకున్నారు. ఈ లిస్ట్ లో తాప్సీ కూడా చేరే సూచనలు కనిపిస్తున్నాయి. 

Latest Videos

click me!