కాగా శ్రీలీల ఖాతాలో క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. మహేష్ కి జంటగా గుంటూరు కారం చేస్తుంది. త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం 2024 సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. అలాగే పవన్ కళ్యాణ్ కి జంటగా ఉస్తాద్ భగత్ సింగ్ చేస్తుంది. ఈ చిత్రానికి హరీష్ శంకర్ డైరెక్టర్. ఇది తేరీ రీమేక్. అలాగే విజయ్ దేవరకొండకు జంటగా ఓ చిత్రం, ఆదికేశవ, ఎక్స్ట్రా ఆర్డినరీ మాన్ చిత్రాల్లో శ్రీలీల నటిస్తుంది.