హీరో యష్ శ్రీలీలకు బావ అవుతాడా... దీని వెనుక పెద్ద కథే ఉంది!

Published : Aug 28, 2023, 12:19 PM IST

హీరో యష్ ని శ్రీలీల బావా అని పిలుస్తుందట. దీనికి వెనుకున్న ఆసక్తికర కథను శ్రీలీల తాజాగా బయటపెట్టారు.   

PREV
16
హీరో యష్ శ్రీలీలకు బావ అవుతాడా... దీని వెనుక పెద్ద కథే ఉంది!
Sreeleela

కెజిఎఫ్ చిత్రాలతో ఇండియా మొత్తం పాపులారిటీ తెచ్చుకున్నాడు హీరో యష్. ఈ పాన్ ఇండియా స్టార్ నెక్స్ట్ మూవీ కోసం ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అదే సమయంలో నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. అభిమానులను యష్ చల్లబరిచే ప్రయత్నం చేస్తున్నాడు. కన్నడ పరిశ్రమకే చెందిన శ్రీలీల టాలీవుడ్ ని దున్నేస్తుంది. అరడజనుకు పైగా చిత్రాలు చేస్తుంది. 

 

26

యష్ ని శ్రీలీల బావ అనిపిస్తుందట. అంటే యష్ కి శ్రీలీల బంధువా అంటే అదీ కాదు. దీనికి వెనుక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది. శ్రీలీల తల్లి స్వర్ణలత బెంగుళూరులోనే ప్రముఖ గైనకాలజిస్ట్. యష్ భార్య రాధికకు రెండుసార్లు స్వర్ణలత డెలివరీ చేశారట. ఆ విధంగా యష్ ఫ్యామిలీతో శ్రీలీల కుటుంబానికి సాన్నిహిత్యం ఏర్పడింది. 

36

రాధిక ఆసుపత్రిలో ఉన్న సమయంలో శ్రీలీల తరచుగా కలిసేదట. ఈ క్రమంలో రాధికను అక్క అని పిలిచేదట శ్రీలీల. ఆ వరసన రాధిక భర్త అయిన యష్ ని జీజూ(బావ) అని పిలిచేదట. పబ్లిక్ లో అలా పిలవకున్నా, ప్రైవేట్ గా యష్ ని శ్రీలీల బావ అంటుందట. అలా యష్ శ్రీలీలకు బావ అయ్యాడన్న మాట.

46

అలాగే శేఖర్ మాస్టర్ కి క్షమాపణలు చెబుతూ శ్రీలీల మూడు పేజీల లేఖ రాసిందట. ఓ సాంగ్ కి శ్రీలీల ఏకంగా 30 టేకులు తీసుకుందట. అందుకు చాలా బాధపడిన శ్రీలీల శేఖర్ మాస్టర్ కి క్షమాపణలు చెప్పిందట. అందులో నీ తప్పేం లేదు. అది చాలా మంది డాన్సర్స్ తో కూడిన సాంగ్. వాళ్ళు కూడా కరెక్ట్ గా చేయాలి. అందుకు అన్ని టేక్స్ పట్టిందని శేఖర్ మాస్టర్ అన్నారట. తాజా ఇంటర్వ్యూలో శ్రీలీల ఈ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. 
 

56

శ్రీలీల నటించిన స్కంద విడుదలకు సిద్ధమైంది. సెప్టెంబర్ 15న వరల్డ్ వైడ్ విడుదల కానుంది. రామ్ పోతినేని హీరోగా దర్శకుడు బోయపాటి శ్రీను యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందించారు. పాన్ ఇండియా చిత్రంగా ఐదు భాషల్లో అందుబాటులోకి తెస్తున్నారు.

66

స్కందతో పాటు గుంటూరు కారం, ఉస్తాద్ భగత్ సింగ్, భగవంత్ కేసరి, ఆది కేశవ, ఎక్స్ట్రా ఆర్డినరీ మాన్, విజయ్ దేవరకొండ, నవీన్ పోలిశెట్టి చిత్రాల్లో శ్రీలీల నటిస్తుంది.

click me!

Recommended Stories