టేబుల్ ఎక్కిన స్టార్ లేడీ శ్రియా... అందాలు చూసి తన్మయత్వంలో అభిమానులు!

heroine shriya saran jaw dropping poses in latest designer wear ksr 
నాలుగు పదుల వయసులో కూడా అందాలతో దాడి చేస్తుంది శ్రియా శరన్. ఈ తరం హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ క్రేజీ ఆఫర్స్ పట్టేస్తుంది. ఆమె లేటెస్ట్ ఫోటోస్ వైరల్ అవుతున్నాయి. 

Shriya Saran


డిజైనర్ వేర్ ధరించిన శ్రియ టేబుల్ పై గ్లామర్ ఫోజులిచ్చింది. అమ్మడు జీరో సైజ్ ఫిజిక్ గుండెల్లో గుబులు రేపుతోంది. శ్రియ విషయంలో వయసు జస్ట్ నెంబర్ మాత్రమే అనిపిస్తుంది. శ్రియ శరన్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. 

Shriya Saran

ఇటీవల మ్యూజిక్ స్కూల్ చిత్రంతో శ్రియ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. దర్శకుడు పాపారావు బియ్యాల ప్రయోగాత్మకంగా మ్యూజిక్ స్కూల్ చిత్రం తెరకెక్కించారు. వరల్డ్ వైడ్ పలు భాషల్లో ఈ చిత్రం విడుదల చేశారు. శర్మన్ జోషి, ప్రకాష్ రాజ్ వంటి నటులు కీలక పాత్రలు చేశారు.  ఇక నలబై ఏళ్ల శ్రియ కెరీర్ ఎక్కడా నెమ్మదించలేదు. స్టార్ హీరోయిన్ హోదా పోయినప్పటికీ ఆఫర్స్ తగ్గలేదు. అడపాదడపా చిత్రాల్లో ఆమె నటిస్తూనే ఉన్నారు. 2022లో ఆర్ ఆర్ ఆర్, తడ్కా, దృశ్యం 2 చిత్రాల్లో శ్రియ శరన్ నటించారు. 


Shriya Saran


2023 ప్రారంభంలో కబ్జ చిత్రంలో మెయిన్ హీరోయిన్ రోల్ చేశారు. పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన కబ్జ  నిరాశపరిచింది. ఉపేంద్ర హీరోగా కబ్జ  తెలిసిందే. ప్లాప్ అయినప్పటికీ కబ్జ చిత్ర సీక్వెల్ ఉందంటూ ప్రచారం జరుగుతుంది. 

Shriya Saran

  జయాపజయాలతో సంబంధం లేకుండా ఆమె జర్నీ సాగుతుంది. వెండితెరపై ఎలాంటి విరామం సత్తా చాటుతుంది. శ్రియ పారిశ్రమకు వచ్చి రెండు దశాబ్దాలు దాటిపోయింది. శ్రియ తోటి హీరోయిన్స్ ఎప్పుడో ఫేడ్ అవుట్ అయ్యారు. 
 

Shriya Saran

2001లో విడుదలైన  ఇష్టం మూవీతో శ్రియ వెండితెరకు పరిచయమైంది. సంతోషం, చెన్నకేశవరెడ్డి, నువ్వే నువ్వే... వంటి వరుస హిట్స్ తో ఆమె స్టార్ అయ్యారు. దశాబ్దానికి పైగా శ్రియ నార్త్ టు సౌత్ అన్ని పరిశ్రమల్లో సత్తా చాటారు. తెలుగులో రెండు జనరేషన్స్ స్టార్స్ తో నటించిన ఘనత ఆమె సొంతం. చిరు, బాలయ్య, నాగ్, వెంకీలతో పాటు మహేష్, ఎన్టీఆర్, ప్రభాస్, పవన్ లతో ఆమె జతకట్టారు.

Shriya Saran

కెరీర్ నెమ్మదించాక  రష్యన్ ప్రియుడు ఆండ్రూని శ్రియ వివాహం చేసుకున్నారు. 2018లో శ్రియా-ఆండ్రూ వివాహం నిరాడంబరంగా జరిగింది. బంధువులు, సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు.  ఇక పిల్లల్ని కూడా ఆమె రహస్యంగానే కన్నారు. లాక్ డౌన్ సమయంలో గర్భం దాల్చిన శ్రియా పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చింది.    

Latest Videos

click me!