గత ఏడాది శివాత్మిక నటించిన ప్రయోగాత్మక చిత్రం పంచతంత్రం విడుదలైంది. పంచతంత్రం చిత్రానికి ప్రేక్షకాదరణ దక్కలేదు. అలాగే ఆకాశం టైటిల్ తో విడుదలైన తమిళ డబ్బింగ్ మూవీ కూడా ఆడలేదు. కాగా తమిళంలో కూడా శివాత్మికకు ఆఫర్స్ వస్తున్నాయి. ఏక కాలంలో రెండు పరిశ్రమల్లో శివాత్మిక అదృష్టం పరీక్షించుకుంటున్నారు.