బ్లాక్ ట్రెండీ వేర్లో సమంత బోల్డ్ ట్రీట్... దేశం మారడంతో వేషం మార్చేసింది!

Published : Apr 19, 2023, 01:45 PM IST

సమంత అల్ట్రా స్టైలిష్ లుక్ షాక్ ఇస్తుంది. బ్లాక్ డిజైనర్ వేర్లో ఊహించని విధంగా తయారైంది. సమంత లేటెస్ట్ ఫోటో షూట్ ఇంస్టాగ్రామ్ లో పంచుకోగా వైరల్ అవుతుంది.   

PREV
16
బ్లాక్ ట్రెండీ వేర్లో సమంత బోల్డ్ ట్రీట్... దేశం మారడంతో వేషం మార్చేసింది!
Samantha

సమంత ఇంగ్లాండ్ వెళ్లారు. అక్కడ సిటాడెల్ వరల్డ్ ప్రీమియర్ షో ప్రదర్శనకు హాజరయ్యారు. సిటాడెల్ టీమ్ రాజ్ అండ్ డీకే, హీరో వరుణ్ ధావన్ లతో పాటు సమంత ఈ ఈవెంట్లో పాల్గొన్నారు. సిటాడెల్ ఇంటెర్నేషనల్ సిరీస్. ఇండియన్ వెర్షన్ లో సమంత నటిస్తున్నారు. ఇంటర్నేషనల్ ప్రీమియర్ కి ఆమె హాజరయ్యారు. 
 

26
Samantha

సమంత నటిస్తున్న సిటాడెల్ సిరీస్ చిత్రీకరణ దశలో ఉంది. సిటాడెల్ వరల్డ్ ప్రీమియర్ ఈవెంట్ కి సమంత సూపర్ స్టైలిష్ గా తయారయ్యారు. ఇంటెర్నేషనల్ ఈవెంట్ కి మ్యాచ్ అయ్యేలా బ్లాక్ డిజైనర్ వేర్ ధరించారు. సమంత లేటెస్ట్ లుక్ వైరల్ అవుతుంది. చిత్ర ప్రముఖులు సమంత ఫోటోలపై అభిప్రాయం వెల్లడిస్తున్నారు.

36
Samantha


ఇక దేశం మారగానే సమంత వేషం మార్చేశారని కొందరు అభిప్రాయపడుతున్నారు. శాకుంతలం చిత్ర ప్రమోషన్స్ లో సమంత తెల్లని వస్త్రాలలో కనిపించారు. చీర కట్టి, చేతిలో జపమాల పట్టి చాలా సాదాసీదాగా, ప్రశాంతమైన లుక్ మైంటైన్ చేశారు. సిటాడెల్ ప్రీమియర్ షోలో దానికి పూర్తి భిన్నంగా ఆమె పాల్గొన్నారు. 
 

46
Samantha

కెరీర్లో ఫస్ట్ టైం శాకుంతలం రూపంలో భారీ షాక్ తగిలింది. గతంలో ఎన్నడూ సమంత ఇంత పెద్ద ఫెయిల్యూర్ సోలోగా ఫేస్ చేయలేదు. దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కించిన శాకుంతలం వసూళ్లు దారుణంగా ఉన్నాయి. పెట్టుబడిలో ఐదు పది శాతం కూడా తిరిగొచ్చే పరిస్థితి లేదు. సాయంత్రం నుండి శాకుంతలం థియేటర్స్ ప్రేక్షకులు లేక వెలవెలబోయాయి. 
 

56


శాకుంతలం చిత్ర ఫెయిల్యూర్ పై సమంత స్పందించడం విశేషం. పరోక్షంగా ఇదంతా కర్మఫలం అని తేల్చేశారు. ప్రయత్నం చేయడం వరకే మన చేతుల్లో ఉంటుంది. వాటి ఫలితం మీద కాదని చేప్పే భగవద్గీత లోకి శ్లోకాన్ని పోస్ట్ చేసింది. ఆమె శాకుంతలం ప్రేక్షకులకు నచ్చలేదని సమంత నేరుగా ఒప్పుకున్నారు. 

66

ప్రస్తుతం సమంత సిటాడెల్ తో పాటు విజయ్ దేవరకొండ చిత్రంలో నటిస్తున్నారు. దర్శకుడు శివ నిర్వాణ ఖుషి టైటిల్ తో ఓ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ రూపొందిస్తున్నారు. ఖుషి చిత్రీకరణ చివరి దశకు చేరింది. సెప్టెంబర్ 1న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. చాలా కాలం తర్వాత సమంత లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ లో నటిస్తున్నారు. గతంలో శివ నిర్వాణ దర్శకత్వంలో సమంత మజిలీ చిత్రం చేశారు. అది సూపర్ హిట్ కొట్టింది. 
 

click me!

Recommended Stories