దీనితో విక్రమ్, శంకర్ సదాని ఇతర దర్శకులకు రికమండ్ చేయలేదు అనే రూమర్స్ ఉన్నాయి. కానీ అపరిచితుడు లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత సదా కెరీర్ వేగం పుంజుకోవాల్సింది పతనమవుతూ వచ్చింది. అదే టైంలో రొమాంటిక్ హీరో మాధవన్ తో కలసి సదా వెంటవెంటనే ప్రియసఖి, నేను తను ఆమె లాంటి చిత్రాల్లో నటించింది. ప్రియసఖి చిత్రంలో మాధవన్ తో సదా చేసిన రొమాన్స్ అప్పట్లో హాట్ టాపిక్.