ఆమె ఒక్కతే నన్ను టార్చర్ చేస్తోంది, నిత్యామీనన్ సంచలన వ్యాఖ్యలు ఎవరి గురించి..?

Published : Oct 22, 2023, 11:25 AM IST

నిత్యమీనన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. కెరీర్ పరంగా, ఫ్యామిలీ పరంగా తనకు తిరుగు లేదు అంటున్న మలయాళ బ్యూటీ.. ఒకరు మాత్రం తనను టార్చర్ చేస్తున్నారని అంటుంది. ఇంతకీ ఎవరు వారు..?   

PREV
16
ఆమె ఒక్కతే నన్ను టార్చర్ చేస్తోంది, నిత్యామీనన్ సంచలన వ్యాఖ్యలు  ఎవరి గురించి..?

సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో డిఫరెంట్ హీరోయిన్స్ కొంత మంది ఉన్నారు సాయి పల్లవి, నిత్యమీనన్, నివేద థామస్... ఇలా కమర్షియల్ హంగులకు దూరంగా.. మంచి మంచి మంచి సినిమాలు మాత్రయే చేసుకుంటూ..  స్కిన్ షోలకు స్పేస్ ఇవ్వకుండా సినిమాలు చేసుకుంటూ..ఇండస్ట్రీలో తమకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. అందులో నిత్యమీనన్ రూటు సపరేటు. ఆమెకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. నిత్య మీనన్ అంటే ఇషక్టపడటని వారు ఉండరు. ఆమె చేసే సినిమాలు కూడా అంత అద్భుతంగా ఉంటాయి మరి. 
 

26

సింగర్ గా కెరీర్ స్టార్ట్ చేసి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి..కెరీర్ బిగినింగ్ నుంచి తను నమ్ముకున్న సిద్దాంతాలు లోబడే సినిమాలు చేస్తూ వస్తుంది నిత్య.నటనకు ప్రాముఖ్యం ఉన్న పాత్రలు మాత్రమే ఎంచుకోని వరుస హిట్స్ తో దూసుకుపోతుంది నిత్యమీనన్.  గ్లామర్ రోల్స్ చేస్తే కోట్లు ఇస్తామన్నా ఆమె టెమ్ట్ అవ్వలేదు.. నటనను మాత్రమే నమ్ముకుంది మలబారు బ్యూటీ. 
 

36
kumari srimathi

తెలుగుతో పాటు త‌మిళ, మ‌ల‌యాళ భాష‌ల్లో వరుసగా సినిమాలు చేసుకుంటూ వచ్చిన నిత్య.. ఈమధ్య కాస్త జోరు తగ్గించింది. తక్కువ సినిమాలు చేసినా. .మంచి సినిమాలు గుర్తుండిపోయే సినిమాలు చేస్తుంది. తాజాగా ఆమె శ్రీమతి కుమారి అనే వెబ్ సిరీస్ ద్వారా తెలుగు ప్రేక్షకులను పలుకరించింది. ఫ‌న్ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యి మంచి రెస్పాన్స్ ను సాధించింది. 

46

అయితే ఈ వెబ్ మూవీకి మంచి రెస్పాన్స్ రావడంతో.. సక్సెస్ మీట్ కూడా చేసుకున్నారు టీమ్. ఇక ఈ వెబ్ మూవీకి సబంధించి కొన్ని ఇంటర్వ్యూలు కూడా ఇచ్చింది నిత్యా మీనన్. అందులో తన కెరీర్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్నారు. ఈ సంద‌ర్భంగా పెళ్లి గురించి ఆమె ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసింది. తన పేరెంట్స్ తనకు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చారని తెలిపింది. తన పెళ్లి విష‌యంలోనూ ఎప్పుడూ వారు ఒత్తిడి తీసుకురాకుండా చాలా సపోర్టివ్ గా ఉన్నారని చెప్పింది. 

56

తన ఇంట్లో కాని.. బయట కానీ తనపై ప్రెజర్ తెచ్చేవారు ఎవరూ లేరు కాని.. తన బామ్మ మాత్రం తనను  హీరోయిన్ గా చూడదన్నారు. తనకు వాల్యూ ఇవ్వకుండా మాటలతో టార్చర్ పెట్టేదన్నారు నిత్య. సూటి పోటి మాటలతో ఇబ్బంది పెట్టేదట. ఇన్నేళ్ల వయసు వచ్చింది ఎప్పుడు పెళ్లి చేసుకుంటావంటూ వేధించుకుని తినేదట భామ్మ.
 

66

క‌నీసం తననో నటిగా కూడా గుర్తించేది కాదట. నువ్వేం  చేస్తున్నావ్‌.. ఇంత వరకూ నువ్వు జీవితంలో సాధించిందేమిటి..? ఇంకా ఎన్ని రోజులు ఇలా ఉంటావ్.. త్వరగా  పెళ్లి చేసుకోవ‌చ్చు క‌దా.. అంటూ .. మాటలతో ఫ్రై చేసేసేదట. ఇక ఆమె తప్పితే తనను ఇంత వరకూ అనే ధైర్యం ఎవరు చేయలేదు అంటోంది నిత్య. పెళ్ళి గురించి తనపై ఎవరి ఫోర్స్ లేదంటోంది బ్యూటీ.. తనకు చేసుకోవాలి అనిపించినప్పుడు చేసుకుంటాను అంటోంది. 

 

click me!

Recommended Stories