Disha Patani
ప్రముఖ ఇన్నర్ వేర్ బ్రాండ్ కాల్విన్ క్లైన్ కి దిశా బ్రాండ్ అంబాసిడర్ గా ఉంది. దీంతో తరచుగా లోదుస్తుల్లో వేడి పుట్టించే ఫోటో షూట్స్ చేస్తుంటారు. దిశా లేటెస్ట్ షూట్ ఇంటర్నెట్ లో ప్రకంపనలు రేపుతోంది.
Disha Patani
డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ లోఫర్ మూవీతో దిశాను హీరోయిన్ చేశారు. వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన లోఫర్ అనుకున్నంత విజయం సాధించలేదు. మదర్ సెంటిమెంట్ తో పూరి లోఫర్ తెరకెక్కించారు. ఆయన హస్తవాసి దిశాకు కలిసొచ్చింది. స్టార్ హీరోయిన్ అయ్యింది.
Disha Patani
తెలుగులో ఆమెకు ఆఫర్స్ రాకున్నా బాలీవుడ్ లో నిలదొక్కుకుంది. ఎంఎస్ ధోని, భాగీ 2, భరత్ చిత్రాలు ఆమెకు బ్రేక్ ఇచ్చాయి. అయితే సల్మాన్ ఖాన్ తో చేసిన రెండో చిత్రం రాధే అనుకున్న స్థాయిలో ఆడలేదు. ప్రభుదేవా దర్శకత్వంలో విడుదలైన రాధే అట్టర్ ప్లాప్ టాక్ తెచ్చుకుంది.
Disha Patani
ప్రస్తుతం సిద్ధార్థ్ మల్హోత్రాకు జంటగా యోధ చిత్రం చేస్తున్నారు. కాగా ప్రభాస్ హీరోగా దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న మూవీ కల్కి 2898 AD లో దిశ నటిస్తున్నారు. దీపికా పదుకొనె హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో దిశ కీలక రోల్ చేస్తున్నారు. దిశా ఫస్ట్ లుక్ ఆసక్తి రేపింది.
కల్కి 2898 AD పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కుతుంది. దాదాపు రూ. 500 కోట్లకు పైగా బడ్జెట్ కేటాయించారు. మరి ఈ మూవీలో దిశా రోల్ ఎలా ఉంటుందో చూడాలి. ఆమె గ్లామర్ మాత్రం తెలుగు ప్రేక్షకులు పెద్ద ట్రీట్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. అలాగే సూర్య హీరోగా దర్శకుడు శివ తెరకెక్కిస్తున్న కంగువ అనే తమిళ చిత్రంలో ఆమె నటిస్తుంది.
హీరో టైగర్ ష్రాఫ్ తో దిశా చాలా కాలం ఎఫైర్ నడిపింది. అతనికి గుడ్ బై చెప్పిన దిశా... మోడల్, నటుడు అలెక్సాండర్ ఇలిక్ తో ఆమె ఎఫైర్ పెట్టుకుంది. పలు సందర్భాల్లో వీరిద్దరూ జంటగా కనిపించారు.తరచుగా దిశా అతనితో విందులు, వినోదాల్లో పాల్గొంటున్నారు. దీంతో దిశా పటాని-అలెక్సాండర్ మధ్య ఘాడమైన ప్రేమబంధం ఏర్పడిందని ఇండస్ట్రీ వర్గాల వాదన.