పక్కింటి అమ్మాయిలా ఉండే మీరా జాస్మిన్ కి అప్పట్లో పిచ్చ ఫాలోయింగ్ ఉండేది. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఆమె ఫేమ్ తెచ్చుకున్నారు. పలు బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించారు. తెలుగులో ఆమె నటించిన భద్ర మంచి విజయాన్ని అందుకుంది. విశాల్ పందెం కోడి చిత్రం తెలుగులో కూడా మంచి విజయం సాధించగా ఆమెకు గుర్తింపు వచ్చింది.