స్టార్ హీరోయిన్లు మేకప్ లేకుండా బయట కనిపించిన సందర్భాలు చాలా తక్కువ ఉంటాయి. అరుదుగా కనిపించే ఆదృశ్యాలను చటుక్కున కెమెరా కళ్ళు క్లిక్కుమనిపిస్తుంటాయి. తాజాగా స్టార్ హీరోయిన్ కాజల్ కూడా మేకప్ లేకుండా కనిపించింది. ఇక కెమెరాలకు పండగే.
కాజల్ రీసెంట్ గా అర్ధరాత్రి ముంబయ్ ఏయిర్ పోర్ట్ లోకనిపించింది. ఫ్యూర్ వైట్ షర్ట్.. బ్లూ జీన్స్ లో టక్ చేసుకుని..సూపర్బ్ లుక్ లో కనిపించింది పంచదార బొమ్మ. అయితే ఆమె మేకప్ మాత్రం వేసుకోలేదు. అలా క్యాజువల్ గానే కనిపించింది.
సాధారణంగా హీరోయిన్లు మేకప్ లేకుండా బయటకు రారు.. చాలా అరుదైన సందర్భాలలో మాత్రమే ఈ లుక్స్ లో కనిపిస్తుంటారు. అలా కాజల్ మేకప్ లేకుండా కనిపించగానే.. ఇలా ఫోటో గ్రాఫర్లు తమ కెమెరాకళ్లకుపనిచెప్పారు. వరుసగా ఫోటోలు క్లిక్కుమనిపించారు.
ఇక పెళ్ళి తరువాత సినిమాలు తగ్గించేసింది కాజల్. అసలు అవకాశాలే రావడం లేదు అంటున్నారు సినిమా జనాలు. అయితే ఆమధ్య కాస్త బోద్దుగా కనిపించిన ఆమె.. వర్కౌట్స్ చేసి నాజూగ్గా తాయారయ్యింది. అయితేఈ విషయంలో అసలు సీక్రేట్ ను రీసెంట్ గా వెల్లడించింది కాజల్.
తాను ఎంత తిన్నా లావు అవ్వదట కాని.. ఒక రెండు రోజులు వర్కౌట్లు మానేస్తే మాత్రం వెంటనే లావుగా తయారవుతుందట. తనకు ఈ ప్రాబ్లమ్ ఉందటంతో.. ఏరోజు వర్కౌట్ చేయకుండా ఉండలేను అంటోంది కాజల్. అది తన జీవితంలో ఒక భాగంగా మారిపోయిందంటోంది.
ప్రస్తుతం కొన్నిసినిమాలు చేస్తోంది కాజల్. రీసెంట్ గా భగవంత్ కేసరిసినిమాలో బాలయ్య సరసన ఫస్ట్ టైమ్ మెరిసింది బ్యూటీ. ఇక తమిళ్ లో కమల్ హాసన్ హీరోగా తెరకెక్కుతోన్న ఇండియన్ 2లో కూడా నటిస్తోంది బ్యూటీ. వీటితో పాటు మరికొన్నిప్రాజెక్ట్స్ తన చేతిలో ఉన్నాయి.
అటు హిందీలో కూడా పలు వెబ్ సిరీస్ లలో నటించడానికి ఆమె ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే వీటికంటే ఎక్కువగా తన ఫ్యామిలీని చూసుకోవడం.. తన బాబు ఆలనా పాలన చూసుకోవడం తనకు ఎంతో ఇష్టం అంటోంది కాజల్. ముందు ముందుసినిమాలకు పుల్ స్టాప్ పెట్టినా ఆశ్చర్యపడనవసరం లేదు.