టాలీవుడ్ దర్శక నిర్మాతలు ఈషాను పట్టించుకోవడం మానేశారు. దీంతో ఆమె ఇతర పరిశ్రమల వైపు చూస్తుంది. కెరీర్ బిగినింగ్ నుండి సెకండ్ హీరోయిన్, సప్పోర్ట్ రోల్స్ మాత్రమే ఈషాకు దక్కాయి. ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన అరవింద సమేత వీర రాఘవ మూవీలో ఈషా రెబ్బా నటించినప్పటికీ, ఆమెది కనీస ప్రాధాన్యత లేని పాత్ర కావడంతో, సినిమా హిట్ అయినా ఈషాకు ఎలాంటి గుర్తింపు రాలేదు. అక్కినేని హీరో అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ చిత్రంలో ఓ చిన్న పాత్రలో మెరిశారు ఈషా.