కొన్నాళ్లుగా వర్మ కాంపౌండ్ లో పని చేస్తుంది హీరోయిన్ అప్సరా రాణి. ఈమె అసలు పేరు అంకిత మహారాణా. వర్మ అప్సరా రాణిగా నామకరణం చేశాడు. తన సినిమాలలో అవకాశాలు ఇస్తున్నాడు. అలాగే తన పలుకుబడితో ఇతర హీరోల చిత్రాల్లో ఐటెం సాంగ్స్ ఆఫర్స్ ఇప్పిస్తున్నాడు. 4 లెటర్స్ అనే సినిమాతో వెండితెరకు పరిచయమైన అప్సర, తర్వాత ఊల్లాల ఊల్లాల చిత్రంలో నటించారు. ఈ చిత్రానికి నటుడు సత్య ప్రకాష్ దర్శకత్వం వహించారు.