ఏజ్ బార్ నిర్మాతతో అనుష్క పెళ్లి... ఇన్నేళ్లు ఆగింది దీని కోసమా!

Published : May 16, 2024, 06:10 PM IST

ఎట్టకేలకు అనుష్క శెట్టి పెళ్లికి సిద్దమైందట. అయితే ఆమె ఓ ఏజ్ బార్ నిర్మాతను చేసుకుంటున్నట్లు సమాచారం. కో అంటే కోటి మధ్య అనుష్క కోసం క్యూలో నిలబడతారు. అనుష్క ఈ నిర్ణయం ఎందుకు తీసుకుందనే చర్చ నడుస్తోంది.   

PREV
17
ఏజ్ బార్ నిర్మాతతో అనుష్క పెళ్లి... ఇన్నేళ్లు ఆగింది దీని కోసమా!
Anushka Shetty

 2005లో విడుదలైన సూపర్ చిత్రంతో దర్శకుడు పూరి జగన్నాధ్ అనుష్కను వెండితెరకు పరిచయం చేశాడు. విక్రమార్కుడు, అరుంధతి, బిల్లా వంటి చిత్రాలు స్టార్ హీరోయిన్ చేశాయి. బాహుబలి సిరీస్ తో ఇండియా వైడ్ ఫేమ్ తెచ్చుకుంది. 
 

27

అనుష్క-ప్రభాస్ కలిసి నాలుగు చిత్రాలు చేశారు. బిల్లా చిత్రం కోసం మొదటిసారి కలిసిన ఈ స్టార్స్.. మిర్చి, బాహుబలి, బాహుబలి 2 చిత్రాల్లో జతకట్టారు. ఈ క్రమంలో ఎఫైర్ రూమర్స్ తెరపైకి వచ్చాయి. త్వరలో పెళ్లి అంటూ మీడియా పలుమార్లు కథనాలు ప్రచురించింది. ఈ పుకార్లను ప్రభాస్-అనుష్క కొట్టిపారేశారు. 
 

37

అలాగే దర్శకుడు కే రాఘవేంద్ర రావు కోడలు అవుతుందని మరో పుకారు తెరపైకి వచ్చింది. దర్శకుడు కే ప్రకాశరావు భార్యతో విడిపోయాడు. ఆయన్ని అనుష్క శెట్టి రెండో వివాహం చేసుకుంటుందనే ప్రచారం జరిగింది. ఈ వార్తలు కూడా పుకార్లుగానే మిగిలిపోయాయి. 
 

47


తాజా కథనాల ప్రకారం కన్నడ పరిశ్రమకు చెందిన నిర్మాతతో అనుష్క పెళ్లి నిశ్చయం అయ్యిందట. త్వరలో అధికారిక ప్రకటన రానుందని అంటున్నారు. ఇక సదరు నిర్మాత వయసు 42 ఏళ్ళు ఉంటుందట. అంటే ఏజ్ బార్ అయ్యాక పెళ్లి పీటలు ఎక్కుతున్నాడని చెప్పొచ్చు. అయితే అనుష్క ఏజ్ కూడా 40 ప్లస్. 

57

కాబట్టి అనుష్క విషయంలో సదరు నిర్మాతను ఏజ్ బార్ అనలేము. కాగా అనుష్క నిర్మాతను వివాహం చేసుకోబోతున్నట్లు ఎలాంటి సమాచారం లేదు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ మాత్రమే. అందుకే ఆ నిర్మాత గురించి స్పష్టమైన సమాచారం లేదు. మరి ఈసారైనా అనుష్క పెళ్లి వార్త నిజం కావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. 

67
Anushka Shetty

అనుష్క బాహుబలి 2 తర్వాత ఆచితూచి సినిమాలు చేస్తున్నారు. ఆమెకు డిమాండ్ ఉన్నప్పటికీ స్క్రిప్ట్ నచ్చితేనే ఓకే చెబుతున్నారు. ఇటీవల అనుష్క యంగ్ హీరో నవీన్ పోలిశెట్టికి జంటగా మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి చిత్రం చేసింది. ఇది పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. 

77

ఇటీవల దర్శకుడు క్రిష్ తో లేడీ ఓరియెంటెడ్ మూవీ ప్రకటించింది. ఘాటి ఈ చిత్ర టైటిల్. ప్రీ లుక్ పోస్టర్ ఆకట్టుకుంది. ఈ మూవీ చిత్రీకరణ జరుపుకుంటున్నట్లు సమాచారం. హరి హర వీరమల్లు చిత్రం నుండి తప్పుకున్న క్రిష్ ఘాటి ప్రాజెక్ట్ మొదలెట్టారు. 

Read more Photos on
click me!

Recommended Stories