రిపోర్టర్ పై అను ఇమ్మాన్యుయేల్ ఫైర్.. ‘అలాంటి ప్రశ్నలే ఎందుకు’ అంటూ అసహనం.!

Published : Oct 22, 2022, 02:31 PM IST

హాట్ బ్యూటీ, టాలీవుడ్ హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్ (Anu Emmanuel) తాజాగా నటించిన చిత్రం ‘ఉర్వశివో రాక్షసివో’. ఈ చిత్ర ప్రమోషన్స్ లో పాల్గొంటున్న అనుకు తాజాగా చేధు ప్రశ్న ఎదురవగా.. రిపోర్టర్ పై మండిపడింది.  

PREV
16
రిపోర్టర్ పై అను ఇమ్మాన్యుయేల్ ఫైర్.. ‘అలాంటి ప్రశ్నలే ఎందుకు’ అంటూ అసహనం.!

అల్లు శిరీష్ - అను ఇమ్మాన్యుయేల్ జంటగా వస్తున్న చిత్రం ‘ఉర్వశివో రాక్షసివో’(Urvashivo Rakshashivo). ప్రస్తుతం ఈ చిత్రం రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా శిరీష్, అను ఇద్దరూ చిత్ర ప్రచార కార్యక్రమాల్లో జోరుగా పాల్గొంటున్నారు.

26

అయితే ప్రమోషన్స్ లో భాగంగా  తాజాగా అల్లు శిరీష్, అను ఇమ్మాన్యుయేల్ మీడియాతో  ఇంటరాక్ట్ అయ్యారు. ఈ సందర్భంగా ఓ ఛానెల్ కు చెందిన రిపోర్టర్ అనుపై విసుగుతెప్పించే ప్రశ్నలను సంధించారు. దీంతో చిర్రెత్తిపోయిన అను అసహనం వ్యక్తం చేసింది. రిపోర్టర్ ప్రశ్నల తీరుకు మండిపడింది. 
 

36

అను ఇమ్మాన్యుయేల్ గతంలో అల్లు అర్జున్ తో కలిసి ‘నా పేరు సూర్య’లో నటించిన విషయం తెలిసిందే. ఈ చిత్రం పెద్దగా ఆడకపోయినా బన్నీ నటన ఆడియెన్స్, అభిమానులను ఆకట్టుకుంది. మూవీలో అను ఇమ్మాన్యుయేల్, బన్నీ కెమిస్ట్రీ, రొమాన్స్ కూడా ఫ్యాన్స్ కు నచ్చింది.  అప్పుడు బన్నీ సరసన నటించిన అను.. ఇప్పుడు శిరీష్ సరసన ఆడిపాడింది.
 

46

దీంతో ‘అల్లు అర్జున్, శిరీష్ లో ఎవరు క్యూట్? ఎవరు నాటీ?’ అంటూ రిపోర్టర్ అనును ప్రశ్నించాడు. వెంటనే అను స్పందిస్తూ.. ‘కాస్తా మంచి ప్రశ్నలు అడగండి.. వేరే ప్రశ్నలే లేవా.. అలాంటి ప్రశ్నలే ఎందుకు’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. తర్వాత సినిమాకు సంబంధించిన ప్రశ్నలకు సూటిగా బదులిచ్చిందీ బ్యూటీ.
 

56

చివరిగా ‘మహాసముద్రం’తో ప్రేక్షకులను అలరించింది అను.. ప్రస్తుతం ‘ఊర్వశివో రాక్షసివో’తో మళ్లీ ఆడియెన్స్ ముందుకు వస్తోంది. చిత్రంలో శిరీష్ కు ఏకంగా లిప్ లాక్ కూడా ఇవ్వడంతో సినిమాపై మంచి హైప్ క్రియేట్ అయ్యింది. వీరిద్దరి మధ్య రిలేషన్ కూడా ఉందంటూ రూమర్లు కూడా పుట్టుకొచ్చాయి.  
 

66

ఏదేమైనా నవంబర్ 4న ఈ చిత్రం థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ కానుంది. హీరోహీరోయిన్లుగా అల్లు శిరీష్ - అను ఇమ్మాన్యుయేల్ అలరించబోతున్నారు. రాకేశ్ శశి దర్శకత్వం వహించారు. అల్లు అరవింద్ సమర్పించగా, జీఏ2 పిక్చర్స్ బ్యానర్ పై ధీరజ్ మొగిలినేని నిర్మిస్తున్నారు. ఇప్పటికే చిత్రం నుంచి అప్డేట్స్ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. 
 

click me!

Recommended Stories