కాగా క్రిస్టియన్ అయిన అమలా పాల్ కి కేరళలోని ఓ దేవాలయంలో చేదు అనుభవం ఎదురైందట. ఎర్నాకులంలోని తిరువైరానికులం మహాదేవ ఆలయంలోకి అమలాపాల్ ప్రవేశించడానికి వీలులేదని పూజారులు అడ్డుకున్నారట. మహాదేవ ఆలయంలోకి హిందూ భక్తులకు మాత్రమే ప్రవేశం ఉంటుందని, మీరు ఆలయంలోకి ప్రవేశించరాదని అధికారులు ఆమెకు తెలియజేశారట. తిరువైరానికులం మహాదేవ ఆలయంలో తనకు జరిగిన పరాభవాన్ని అమలా పాల్ ఆలయ సందర్శన రిజిస్టర్ లో నమోదు చేసింది.