విషాదాల ప్రయాణం... ఆ స్టార్ హీరోయిన్‌ జీవితం

Published : May 28, 2020, 03:51 PM ISTUpdated : May 28, 2020, 03:53 PM IST

ఓ ప్రముఖ నటుడి కుమార్తె, చిన్నతనం నుంచి సినిమాలతో అనుబంధం అయినా వెండితెర మీద ఆమె ప్రయాణం అంత సులువుగా సాగలేదు. ఎన్నో విషాదాలు మరెన్నో కష్టాలతో కలిసి ప్రయాణం చేసి ఇప్పుడు స్టార్ ఇమేజ్‌ను అందుకుంది ఐశ్వర్య రాజేష్‌.

PREV
15
విషాదాల ప్రయాణం... ఆ స్టార్ హీరోయిన్‌ జీవితం

చిన్నతనంలోనే తండ్రి మరణంతో ఐశ్వర్య రాజేష్‌ జీవితం పూర్తిగా తిరగబడింది. అమ్మ అన్ని అయి పెంచింది. ఆమెతో పాటు ఇద్దరు సోదరులను పెంచి పోషించింది. చీరలు అమ్మి, ఎల్‌ఐసీ ఎజెంట్‌గా పనిచేసింది.

25

కష్టాలు అక్కడితో తీరలేదు. ఒక సోదరుడు ఆత్మ హత్య చేసుకొని చనిపోయాడు. మరో సోదరుడు రోడ్డు ప్రమాదంలో మరణించాడు. దీంతో అమ్మ తట్టుకోలేకపోయింది. ఆమె ఆరోగ్యం కూడా దెబ్బతింది.

35

కుటుంబ బాధ్యత ఐశ్వర్య మీద పడింది. అమ్మను పోషించటం కోసం  చిన్న చిన్న పనులు కూడా చేసింది ఐశ్వర్య. కానీ చిన్నతనం నుంచి సినిమాల పట్ల ఉన్న ప్రేమ ఆమెను సినీ రంగం వైపు నడిపించింది.

45

హీరోయిన్‌గా అవకాశాలు వచ్చినా అదే స్థాయిలో అవమానాలు. ఆమె రంగును కించ పరుస్తూ దూషించిన వారు కూడా ఉన్నారు. ఇలా తన జీవితంలో ఎదురైన అనేక సంఘటనల గురించి ఓ వేదిక మీద అభిమానులకు వివరించింది ఐశ్వర్య.

55

ప్రముఖ హాస్య నటి శ్రీలక్ష్మీ ఐశ్వర్యరాజేష్‌కు స్వయానా మేనత్త అయినా ఇండస్ట్రీలో ఎలాంటి అండా లేకుండానే అడుగుపెట్టింది. ప్రస్తుతం సౌత్‌లో తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో వరుస సినిమాలు చేస్తోంది ఐశ్వర్య.

click me!

Recommended Stories