రాకీ భాయ్‌ ఆగయా.. ఇక రికార్డులన్నీ పటాపంచల్‌.. హైదరాబాద్‌లో యష్‌ సందడి

First Published Nov 27, 2020, 11:27 PM IST

`కేజీఎఫ్‌` చిత్రంతో కన్నడ చిత్ర పరిశ్రమకి గౌరవాన్ని తీసుకొచ్చి, ఓవర్‌ నైట్‌లో స్టార్‌ అయిపోయాడు హీరో యష్‌. తాజాగా ఆయన `కేజీఎఫ్‌` పార్ట్ 2లో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ హైదరాబాద్‌లో జరుగుతుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌ చేసుకున్న సందర్భంగా యష్‌ ఫోటోలకు చిక్కాడు. ఆ ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి. 

ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో యష్‌ హీరోగా, నిధి శెట్టి హీరోయిన్‌గా రూపొందిన `కేజీఎఫ్‌` సంచలన విజయం సాధించింది. కన్నడ చిత్ర పరిశ్రమలో ఇదే అతిపెద్ద విజయంగాచెప్పుకుంటారు. కలెక్షన్ల పరంగానూ ఇది రికార్డులు సృష్టించింది.
undefined
తాజాగా దీనికి పార్ట్ 2 `కేజీఎఫ్‌ 2` రూపొందుతుంది. కరోనా కారణంగా వాయిదా పడ్ట షూటింగ్‌ ఇటీవలే ప్రారంభమైంది.
undefined
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ హైదరాబాద్‌లోని ఆర్‌ఎఫ్‌సీలోజరుగుతుంది. ఈ నేపథ్యంలో తాజాగా హీరో యష్‌ హైదరాబాద్‌కి చేరుకున్నారు.
undefined
ఎయిర్‌పోర్ట్ లో ఆయన ఫోటోలకు చిక్కాడు. ఆరేంజ్‌ కలర్‌ టీషర్ట్ ధరించి, ముఖానికి మాస్క్ ధరించి, నల్ల కళ్లజోడు పెట్టకుని స్టయిలీష్‌గా నడుచుకుంటూ వస్తున్నారు.
undefined
ఆయన వెంట సహాయకులు, బాడీగార్డ్ రాగా యష్‌ లుక్‌ విశేషంగా ఆకట్టుకుంటుంది. అంతేకాదు సోషల్‌ మీడియాలో ఈ ఫోటోలు తెగ వైరల్‌ అవుతుండటం విశేషం. ఈసినిమాలో యశ్‌.. రాకీ భాయ్‌గా కనిపించనున్న విషయం తెలిసిందే.
undefined
ఇందులో బాలీవుడ్‌ మున్నాభాయ్‌ సంజయ్‌ దత్‌ విలన్‌గా పాత్ర అయిన `అధీర`గా నటిస్తున్నారు. ఆయనతోపాటు రవీనా టండన్‌ కీలక పాత్ర పోషిస్తుంది. ఆమె ఇందిరా గాంధీపాత్రలో కనిపించనున్నట్టు తెలుస్తుంది.
undefined
ఇక హైదరాబాద్‌లో జరిగే షెడ్యూల్‌ చాలా పెద్దదని, దాదాపు నెల రోజులపాటు చిత్రీకరించనున్నారని తెలుస్తుంది. ఇందులో కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తారట. ప్రధాన తారాగణంకూడా పాల్గొంటుందని సమాచారం.
undefined
ఇక ఈ చిత్రాన్ని కైకాల సత్యనారాయణ సమర్పణలో హోంబలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్‌ కిరగందూర్‌ నిర్మిస్తున్నారు. సినిమాని వచ్చే ఏడాది విడుదలకు ప్లాన్‌ చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన `కేజీఎఫ్‌` ఛాప్టర్‌166వ జాతీయచలనచిత్రోత్సవాల్లో రెండు జాతీయ అవార్డులు గెలుచుకున్న విషయం తెలిసిందే. మరి ఇప్పుడు రూపొందుతున్న `కేజీఎఫ్‌2` ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.
undefined
click me!