ఎన్ని కోట్లు ఇచ్చినా `బిగ్‌బాస్‌`కి వెళ్ళను.. హాట్‌ యాంకర్‌ విష్ణు ప్రియ సంచలన కామెంట్‌

తన హాట్‌ అందాలతో అలరిస్తున్న సెక్సీ యాంకర్‌ విష్ణు ప్రియ ఇప్పుడు బిగ్‌బాస్‌ సంచలన కామెంట్‌ చేసింది. బిగ్‌బాస్‌ కాన్సెప్టే తనకు నచ్చదని పేర్కొంది. దీంతో ఎప్పుడు తన హాట్‌ అందాలతో వార్తల్లో నిలిచే ఈ బ్యూటీ ఇప్పుడు మరోసారి చర్చనీయాంశంగా మారింది. 

విష్ణు ప్రియ యాంకర్‌గా బాగా పాపులర్‌ అయ్యింది. `పోరా పోవే` షోతో మరింత పేరు తెచ్చుకున్న ఈ అమ్మడు ఎప్పటికప్పుడు గ్లామర్‌ ఫోటోలను పంచుకుంటూ సోషల్‌ మీడియాలో ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది.
తాజాగా ఓ బిగ్‌బాస్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచింది. అయితే నాల్గో సీజన్‌లో విష్ణుప్రియా కంటెస్టెంట్‌గా రాబోతుందని ఆ మధ్య వార్తలు వినిపించాయి. దీనిపై ఓ ఇంటర్వ్యూలో విష్ణు ప్రియ మాట్లాడుతూ, తనకు బిగ్‌బాస్‌ అంటే అస్సలు నచ్చదని, ఎన్ని కోట్లు ఇచ్చినా తాను బిగ్‌బాస్‌కి వెళ్లనని స్పష్టం చేసింది.

`బిగ్‌బాస్‌లో కొట్టుకోవడాలు, తిట్టుకోవడం, ఎలిమినేషన్‌ వంటివి తనకు నచ్చవని, అలాంటి షోకి డబ్బుల కోసం ఎందుకు పోతా? ఎన్ని కోట్లు ఇచ్చినా వెళ్లను. బయట ప్రపంచం ఇంత అందంగా ఉన్నప్పుడు ఒక హౌజ్‌లో బంధీగా ఉండటం తనకిష్టం ఉండదని పేర్కొంది. ఎట్టిపరిస్థితుల్లోనూ బిగ్‌బాస్‌ హౌజ్‌కి వెళ్ళను. రాసిపెట్టుకోండి` అని తెలిపింది.
నేను బిగ్‌బాస్‌ సభ్యుడిని కాలేను. అంతేకాదు తాను ఎప్పుడూ బిగ్‌బాస్‌ చూడనని తెలిసింది. ఇలాంటి షోలను ఎంకరేజ్‌ చేయనని చెప్పింది. నేను పది మంది మెచ్చుకోవాలని, పేరు రావాలని ఏ పని చేయను. ఆ పనిని నేను ఎంజాయ్‌ చేయాలనేదే చూస్తాను. చేసే పనిని నేను ఆస్వాధించగలిగినప్పుడే, ఇతరులు ఎంజాయ్‌ చేస్తారు. నేను నవ్వుతూఉండాలి, నా చుట్టూ ఉండేవాళ్ళు కూడా నవ్వుతూ ఉండాలని కోరుకుంటున్నా` అని చెప్పింది.
ఇదిలా ఉంటే ఈ హాట్‌ అందాల భామ టీవీ షోస్‌తోపాటు సినిమాల్లోనూ నటిస్తుంది. ప్రస్తుతం ఆమె ప్రధాన పాత్రలో `చెక్‌మేట్‌` చిత్రంలో నటిస్తుంది. ఇందులో ఆమెది గ్లామర్‌పాత్ర అని తెలుస్తుంది.
చిన్ని కృష్ణ ప్రొడక్షన్స్ పతాకంపై పై ప్రసాద్ వెలంపల్లి దర్శక నిర్మాత గా తెరకెక్కించిన `చెక్ మేట్`లో రాజేంద్రప్రసాద్, దీక్షపంత్, బ్రహ్మనందం, రఘుబాబు షకలక శంకర్లతోపాటు విష్ణు ప్రియ కీలక పాత్ర పోషిస్తుంది. ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని రిలీజ్ కు రెడీ అయ్యింది.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విష్ణు ప్రియ మాట్లాడుతూ, `చెక్‌మేట్‌` అంటే ఇద్దరు యంగ్ స్టర్స్ మధ్య ఉండే ప్రాబ్లమ్‌ని ఒకరు వలన ఒకరు ఇబ్బందులుపడుతున్నప్పుడు ఆ సమస్య నుంచి బయట పడడానికి అవతల వాళ్ళు తీసుకున్న యాక్షన్ `చెక్‌మేట్‌` అంటాం.
ఇందులో నటించే అవకాశం నాకు శివరాత్రి వచ్చింది. ఆ శివుడే నాకు ఈ అవకాశం ఇచ్చాడని అనుకుంటాను. స్టొరీ ఏంటి, హీరో ఎవరు అని అడగలేదు. మా మమ్మీ వాళ్ళమ్యుచివల్ ఫ్రెండ్స్ ప్రసాద్ గారు. మా ఇంటికి వచ్చి నన్ను చూసిన తర్వాత నువ్వే హీరోయిన్ అంటే నేను నమ్మలేదు.
అయితే ఒక వారం రోజులకే ఆర్ ఎఫ్ సి కి పిలిచి షూట్ మొదలు పెట్టినప్పుడు అక్కడున్న కెమెరాలు...జిమ్మిలు ఆ వాతావరణం చూసి బ్లాంక్ అయ్యాను. నాకు అసలుయాక్టింగ్ ఏమి తెలీదు. కానీ ఈ సినిమా వల్ల నేను చాలా నేర్చుకున్నాను.
ఈ `చెక్‌మేట్‌` సినిమా నాకు చాలా స్పెషల్‌. ఎంతో నేర్పించింది. మంచి వ్యక్తులను పరిచయం చేసింది. ఎన్నో మెమోరీస్‌ని అందించింది. అమ్మ రాజశేఖర్ రెండు సాంగ్స్ కొరియోగ్రఫీ చేశార`ని తెలిపింది.
`నలుగురు వ్యక్తులు వాళ్లకు వచ్చిన సమస్యలను వాళ్ళు ఎలా దైర్యం గా ఎదుర్కొన్నారనే కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కించామ`ని దర్శక, నిర్మాత ప్రసాద్‌ వెల్లంపల్లితెలిపారు.

Latest Videos

click me!