చరణ్ వైఫ్ ఉపాసనది సహజ గర్భం కాదా! అలా తల్లి అయ్యిందా! ఫైనల్లీ రహస్యం బయటకు!

Published : Mar 09, 2024, 10:47 AM ISTUpdated : Mar 09, 2024, 02:51 PM IST

రామ్ చరణ్ సతీమణి ఉపాసన పెళ్ళైన పదేళ్లకు ఒక పాపకు జన్మనిచ్చారు. అయితే ఆమె సహజంగా గర్భం దాల్చలేదట. ఉపాసన తల్లి కావడం వెనుక రహస్యం ఎట్టకేలకు బయటపడింది.   

PREV
16
చరణ్ వైఫ్ ఉపాసనది సహజ గర్భం కాదా! అలా తల్లి అయ్యిందా! ఫైనల్లీ రహస్యం బయటకు!
Upasana Konidela

మెగా ఫ్యాన్స్ అత్యంత ఆందోళన చెందిన విషయం ఉపాసన తల్లి కాకపోవడం. ఏళ్ళు గడుస్తున్నా శుభవార్త రాకపోవడంతో పూర్తి నిరాశ చెందారు. యాంటీ ఫ్యాన్స్ కొన్ని అపోహలు తెరపైకి తెచ్చారు. చరణ్, ఉపాసన తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఈ విమర్శలకు గత ఏడాది చెక్ పడింది. 

26

2022 డిసెంబర్ లో చిరంజీవి తన కోడలు ఉపాసన గర్భం దాల్చిన విషయం అభిమానులతో పంచుకున్నాడు. వారి ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. 2023 జూన్ 20న ఉపాసన హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చింది. కూతురికి క్లిన్ కార అనే పేరు పెట్టారు. అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు. 

 

36
Upasana Konidela

పదేళ్ల తర్వాత పిల్లలు కనడం వెనుక కారణం ఉపాసన రెండు మూడు సందర్భాల్లో చెప్పారు. పెళ్ళైనప్పుడే పదేళ్ల వరకు పిల్లలు వద్దని చరణ్ నేను అనుకున్నాము. అందుకే ఎంతటి ఒత్తిడి ఎదురైనా పిల్లల్ని కనలేదు. అది ఒక పెద్ద బాధ్యత. అన్ని విధాలా సిద్ధం అయ్యాకే తల్లిదండ్రులు కావాలనుకున్నాం అన్నారు. 

46

అయితే ఉపాసన తన లేటెస్ట్ కామెంట్స్ లో తల్లి అయిన విధానం వివరించింది. ఓ విషయాన్ని వివరిస్తున్న క్రమంలో ఈ రహస్యం బయటపెట్టింది. వెంటనే పిల్లలు వద్దు అనుకున్న మహిళలు తమ ఎగ్స్ భద్రపరుచుకోవచ్చు. వాటిని తల్లి కావాలని కోరుకున్నప్పుడు వాడుకోవచ్చు. 

56

మహిళలు తమ ఎగ్స్ భద్రపరుచుకోవడంతో పాటు వాటిని ఇన్సూరెన్స్ కూడా చేయించుకోవచ్చు. మనం ఆర్థికంగా బలంగా ఉన్నాము. పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వగలం అనుకున్నప్పుడు దాచుకున్న అండాల ద్వారా తల్లి కావచ్చు. నేను కూడా ఇదే చేశాను... అని అన్నారు. 

 

66

దాంతో ఉపాసన సహజంగా తల్లి కాలేదు. గతంలో దాచుకున్న ఎగ్స్ ఫెర్టైల్  చేయడం ద్వారా ఆమె గర్భం దాల్చారని పరోక్షంగా వెల్లడించారు. ఉపాసన కామెంట్స్ చర్చకు దారి తీశాయి. కాగా ఇటీవల ఉపాసన సెకండ్ చైల్డ్ కనేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పడం విశేషం. 

click me!

Recommended Stories