ప్రముఖ దర్శకుడు సంపత్ నంది కథ సమకూర్చగా, దర్శకుడు అశోక్ తేజ డైరెక్ట్ చేశారు. క్రైమ్ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఓటీటీ ఆడియెన్స్ ను ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా హేబా పటేల్ పెర్ఫామెన్స్ కు ఫిదా అవుతున్నారు. పల్లెటూరి మహిళ పాత్రలో కుమారి అద్భుతంగా నటించింది.