తన సినిమా కోసం హన్సికా కిర్రాక్ ఫొటోషూట్.. రెడ్ డ్రెస్ లో యాపిల్ బ్యూటీ మత్తు ఫోజులు..

First Published | Nov 5, 2023, 3:48 PM IST

యాపిల్ బ్యూటీ ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ లో చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. ఒక్కో సినిమా విడుదలకు సిద్ధమవుతున్న సందర్భంగా వాటి ప్రమోషన్స్ లో సందడి చేస్తోంది. ఈ సందర్భంగా కిర్రాక్ ఫొటోషూట్లతో కట్టిపడేస్తోంది. 
 

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ హన్సికా మోత్వానీ (Hansika Motwani) చివరిగా తమిళ చిత్రాలు ‘మహా’, ‘పార్ట్ నర్’ చిత్రాలతో అలరించింది. ప్రస్తుతం తెలుగు చిత్రం My Name Is Shruthiతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దమైంది. ఈ మూవీ ప్రమోషన్స్ ను రీసెంట్ గా ప్రారంభించారు. 
 

‘మై నేమ్ ఇజ్ శృతి’ చిత్ర టీజర్ లాంచ్ ఈవెంట్ తాజాగా జరిగింది. టీజర్ ఆకట్టుకుంటోంది. లేడీ ఓరియెంటెడ్ ఫిల్మ్ తో అలరించేందుకు రెడీ అవుతోంది. అయితే సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఈ ముద్దుగుమ్మ కిర్రాక్ అవుట్ ఫిట్లలో ఫొటోషూట్లు చేస్తోంది. 
 


ఈవెంట్ లో అదిరిపోయే లుక్ తో ఆకట్టుకుంది. తాజాగా అదే అవుట్ ఫిట్ లో ఫొటోషూట్ చేసింది. కిర్రాక్ స్టిల్స్ తో మెస్మరైజ్ చేసింది. అప్పటికే మెరిసిపోయే అందాలతో ఆకట్టుకునే ఈ ముద్దుగుమ్మ ఎర్ర డ్రెస్ లో మరింత స్టన్నింగ్ లుక్ ను సొంతం చేసుకుంది. 

నడుము అందంతో, కవ్వించే ఫోజులతో, మత్తు చూపులతో మంత్రమగ్ధులను చేసింది. తన రూపసౌందర్యంతో చూపుతిప్పుకోకుండా చేసింది. అభిమానులతో పాటు నెటిజన్లనూ ఫిదా చేసింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ బ్యూటీ ఫుల్ ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. 

థ్రిల్లర్ ఫిల్మ్  ‘మై నేమ్ ఈజ్ శృతి’ ఆర్గాన్ మాఫియా నేపథ్యంలో రూపుదిద్దుకుంది. శ్రీనివాస్ ఓంకార్ దర్శకత్వం వహించారు. మార్క్ కే రాబిన్ అద్భుతమైన మ్యూజిక్ అందించారు. త్వరలో చిత్రం విడుదలకు సంబంధించిన వివరాలను వెల్లడించనున్నారు. 
 

గతేడాది డిసెంబర్ లో తన స్నేహితుడు, వ్యాపారవేత్త సోహైల్ కతూరియాను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. పెళ్లి తర్వాత కూడా సినిమాలు చేస్తోంది. మరోవైపు వివాహ బంధానికి సరైన సమయం కేటాయిస్తోంది. టూర్లు, వెకేషన్లకు వెళ్తూ ఫ్యామిలీతో సమయం గడుపుతోంది. 
 

Latest Videos

click me!