Guppedantha manasu: తెలుగు ప్రేక్షకులను అమితంతగా ఆకట్టుకుంటున్న సీరియల్స్ లో గుప్పెడంత మనసు ముందు వరసలో ఉంది. ఈ సీరియల్ లో తీసుకున్న కథను ప్రేక్షకులను కట్టిపడేసింది. అందుకే, ఇప్పటికీ ఈ సీరియల్ టాప్ రేటింగ్ లో దూసుకుపోతోంది. అయితే, ఇటీవల ఈ సీరియల్ లోని ఓ మెయిన్ క్యారెక్టర్ జగతిని చంపేశారు. ఇప్పుడు ఆ స్థానంలోకి అనుపమ అనే మరో పాత్రను ప్రవేశపెట్టాలని చూస్తున్నారు. ఈ క్రమంలోనే ఒక్కో క్యారెక్టర్ ని ఆ అనుపమ పాత్రతో ముడిపెడుతున్నారు. ఇప్పటికే రెండు, మూడు సార్లు వారితో కలిసేలా చేసిన డైరెక్టర్ అతి త్వరలోనే రిషి, వసుధారల జీవితంలోకి అనుపమ ఎంట్రీ ఇచ్చేలా ప్లాన్ చేశారనే విషయం అర్థమౌతోంది. ఇక, ఈ రోజు నవంబర్ 9వ తేదీ ఎపిసోడ్ హైలెట్స్ ఏంటో ఓసారి చూద్దాం..
Guppedantha Manasu
Guppedantha manasu:నిన్నటి ఎపిసోడ్ లో తమ ప్రేమ, పెళ్లి విషయాలను రిషి, వసుధారలు ఎంజెల్ కి వివరించిన విషయం తెలిసిందే. అయితే, ఆ విషయాన్ని ఎంజెల్ నమ్మదు. తనను ఎక్కడ పెళ్లి చేసుకోవాల్సి వస్తుందో అని వసుధార ను పెళ్లి చేసుకున్నాడని, ఇప్పుడు చెప్పిన విషయంలో కొంచెం కూడా నిజం లేదు అని ఏంజెల్ అడ్డంగా వాదిస్తుంది. నిజంగా ఇదే నిజం అయితే, ఈ విషయాన్ని రిషి ఎప్పుడో చెప్పేవాడని, ఇదంతా ఇప్పటికిప్పుడు అల్లిన కథ అంటూ కొట్టి పారేస్తుంది. అదంతా నిజం అని, రిషి నమ్మించడానికి ఎంత ప్రయత్నించినా ఏంజెల్ అంగీకరించదు.
Angel, Guppedantha manasu
దీంతో, వసుధార సీన్ లోకి ఎంట్రీ ఇస్తుంది. అంటే, ఏంజెల్ నిజం అర్థం చేసుకునేలా చెప్పడానికి ప్రయత్నిస్తుంది. రిషి సర్ చెప్పిందంతా నిజమేనని, మీరు నమ్మక తప్పదు అని వసుధార చెబుతుంది. ఆపరిస్థితుల్లో రిషి సర్ నిజాలు బయటపెట్టే పరిస్థితిలో లేరని, అందుకే చెప్పలేదు అని అంటుంది. ఒక రాజు తన రాజ్యం వదిలేసి రావాల్సి వచ్చిందని రిషిని రాజుగా, డీబీఎస్టీ కాలేజీని సామ్రాజ్యంగా పోలుస్తూ చెబుతుంది. అలాంటి రాజుని మీరు ఎవరు అని ప్రశ్నిస్తే, నేను ఒకప్పుడు రాజుని అని చెప్పుకోలేడు కదా, అప్పుడు రిషి సర్ పరిస్థితి కూడా అదే, అందుకే చెప్పలేదు అని వసు వివరిస్తుంది. అయితే, వసు మాటలు కూడా ఏంజెల్ వినిపించుకోదు.
Guppedantha Manasu
సరే, రిషి నిజం చెప్పలేదు అంటే కారణం ఉంది. మరి నువ్వు ఎందుకు చెప్పలేదు వసుధారా? అంటూ ఏంజెల్ వసుని ప్రశ్నిస్తుంది. నిన్ను కూడా నేను చాలా సార్లు అడిగాను కదా, మీ ఇద్దరదికీ అంతకు ముందే పరిచయం ఉందా? మీ ఇద్దరి మధ్య ఏదైనా బంధం ఉందా అని అడిగాను కదా? మరి నువ్వు ఎందుకు నిజం చెప్పలేదు అని ఏంజెల్ గట్టిగానే ప్రశ్నిస్తుంది. అయితే, వసు తాను రిషి సర్ కోసమే నిజం చెప్పలేదని, దాచి పెట్టానని చెబుతుంది.
Guppedantha Manasu
వాళ్లిద్దరూ నిజమే చెబుతున్నా కూడా, రిషి,వసులు తనను మోసం చేశారనే బాధలో ఏంజెల్ ఉండిపోతుంది. అది అర్థం చేసుకున్న రిషి, నీ దగ్గర నిజం దాచిపెట్టినందుకు మేము కూడా ఆ సమయంలో చాలా బాధ పడ్డాం అని చెబుతాడు. ఇంకా మా మీద కోపం పోలేదా ఏంజెల్ అని అడుగుతాడు. అప్పుడు ఏంజెల్, అది కోపం కాదు రిషి, బాధ అంటూ తన బాధను వివరిస్తుంది. అయితే, అంతలో విశ్వం ఏంజెల్ కి సర్థి చెబుతాడు. చాలా ఒడిదుడుకులు ఎదుర్కొని వసు, రిషిలు తమ ప్రేమను గెలిపించుకున్నారని, అలాంటి వారిని మనం ఇలా ప్రశ్నలతో బాధ పెటట్డం కరెక్ట్ కాదని విశ్వం చెప్పడంతో, ఏంజెల్ ఆగిపోతుంది.
Guppedantha Manasu
అయితే, వసు, రిషి లు తనను మోసం చేశారని కోపం, బాధ లోపల చాలా ఉన్నా, ఇక్కడ ఏంజెల్ చాలా హుందాగా ప్రవర్తిస్తుంది. కొత్తగా పెళ్లి చేసుకొని వచ్చిందని వసుధారకు బొట్టు పెట్టి, చీర కూడా పెడుతుంది. అది అందుకున్న తర్వాత, రిషిధారలను అక్కడి నుంచి సెలవు తీసుకొని బయలు దేరుతారు. అంతకముందు, విశ్వనాథం రిషితో మాట్లాడుతూ, డీబీఎస్టీ కాలేజీతో పాటు, విష్ కాలేజీ బాధ్యత కూడా నీదే అంటూ అప్పగిస్తాడు. తాను చదువు విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం చేయనను, ఆ బాధ్యతలను తాను పూర్తి చేస్తానని రిషి మాట ఇస్తాడు.
Guppedantha Manasu
తర్వాత సీన్ లో మహేంద్ర జగతి ఫోటో దగ్గర నిల్చొని బాధపడుతూ ఉంటాడు. మందు తాగుదామని పట్టుకుంటాడు. కానీ, రిషికి ఇచ్చిన మాట గుర్తుకు వచ్చి ఆగిపోతాడు. ఇదే విషయాన్ని జగతి ఫోటోతో మాట్లాడుతూ ఉంటాడు.
Guppedantha Manasu
ఇక, ఏంజెల్ ఇంటి నుంచి రిషి, వసుధారలు అలా గుమ్మం దాటడం, ఇటు అనుపమ కిందకు దిగుతున్నట్లుగా చూపిస్తారు. అప్పటి వరకు తన గదిలో రెడీ అయిన అనుపమ, అప్పుడే కిందకు దిగి వస్తుంది. అప్పటికే రిషి, వసులు వెళ్లిపోతారు. ఇక, అనుపమను చూసి విశ్వనాథం ఆనందంలో కన్నీళ్లు పెట్టుకుంటాడు. అసలు, అనుపమకీ విశ్వనాథం ఫ్యామిలీకి ఉన్న కనెక్షన్ ఈ సీన్ తో అర్థమైపోయింది. విశ్వనాథం కూతురే ఈ అనుపమ. ఇక, ఏంజెల్ విశ్వనాథం కొడుకు కూతురు కావడం విశేషం.
Guppedantha Manasu
ఇక, చాలా కాలం తర్వాత అనుపమ ఇంటికి రావడంతో విశ్వనాథం ఆనందపడతాడు. ఈ సీన్ ని బట్టి, ఏంజెల్ మొదటిసారి తన అత్తను చూస్తోంది. మహేంద్ర, జగతిల పెళ్లి తర్వాత, తాను పెళ్లి చేసుకోకుండా అనుపమ సింగిల్ గా మిగిలిపోయింది. తన తండ్రికి కూడా దూరంగా ఉండిపోయింది. ఇన్నాళ్ల తర్వాత మళ్లీ వాళ్లను కలిసిందనే విషయం అర్థమౌతోంది. ఇక, తన మేనత్తను చూసి ఏంజెల్ సంతోషపడుతుంది.
తర్వాత సీన్ లో అనుపమ దగ్గర ఉన్న మహేంద్ర, జగతిల ఫోటోలను ఏంజెల్ చూడాలని అనుకుంటుంది. అయితే, అది తన పర్సనల్ అంటూ అనుపమ దాచేస్తుంది. దీంతో కాస్త అలిగినట్లుగా ముఖం పెట్టిన ఏంజెల్, తన ఫ్రెండ్ కూడా ఏది అడిగినా పర్సనల్, పర్సనల్ అని చెబుతూ, లాస్ట్ కి పెద్ద షాకిచ్చాడు అని తన అత్తతో చెబుతుంది. రిషిని ఉద్దేశించి ఏంజెల్ ఆ మాటలు అనడం గమనార్హం.
డైరెక్టర్ చాలా తెలివిగా అనుపమ క్యారెక్టర్ ని ప్రవేశపెట్టినట్లు తెలుస్తోంది. ఏంజెల్ ద్వారా అనుపమ మళ్లీ మహేంద్ర, రిషిల జీవితంలోకి అడుగుపెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. జగతి స్థానాన్ని అనుపమ భర్తీ చేస్తుందా లేదా అనేది చూడాలి. అనుపమ ద్వారా రిషికి తన తల్లి గురించి మరిన్ని విషయాలను తెలియనున్నాయా? అనేవి ఆసక్తికరంగా మారింది.