గోపీచంద్‌ ముక్కు పగలగొట్టిన ప్రభాస్‌.. ఇద్దరి మధ్య గొడవేంటి?.. డార్లింగ్‌కి ఇలాంటి అలవాటు ఉందా?

Published : May 10, 2024, 08:45 PM ISTUpdated : May 11, 2024, 07:25 AM IST

ప్రభాస్‌, గోపీచంద్‌ మంచి స్నేహితులు. అయితే ఇద్దరి మధ్య ఓ గొడవ అయ్యిందట. ప్రభాస్‌ కొడితే గోపీచంద్‌ ముక్కు పగిలిందట. ఆ ఘటన బయటపెట్టారు డార్లింగ్‌.  

PREV
18
గోపీచంద్‌ ముక్కు పగలగొట్టిన ప్రభాస్‌.. ఇద్దరి మధ్య గొడవేంటి?.. డార్లింగ్‌కి ఇలాంటి అలవాటు ఉందా?

ప్రభాస్‌, గోపీచంద్‌ లు ఇండస్ట్రీలో బెస్ట్ ఫ్రెండ్స్ అనే విషయం తెలిసిందే. సినిమాల్లోకి రకముందు నుంచి వారి స్నేహం కొనసాగుతుంది. ఇద్దరు కలిసి `వర్షం` చిత్రంలోనూ నటించారు. వారి స్నేహం మరింత బలపడింది. అప్పట్నుంచి ఇప్పటి వరకు ఆ స్నేహం అలానే కొనసాగుతుంది. ది బెస్ట్ ఫ్రెండ్స్ గా ఈ ఇద్దరు రాణిస్తున్నారు. ఇద్దరు కలిసి మళ్లీ ఓ సినిమా చేయాలనే ప్లాన్‌లోనూ ఉన్నట్టు సమాచారం. 
 

28
prabhas gopichand

ఇదిలా ఉంటే ఇద్దరి మధ్య జరిగిన గొడవని బయటపెట్టారు ప్రభాస్‌. ఓ రోజు గోపీచంద్‌ని కొట్టాడట ప్రభాస్‌. కొడితే ముక్కు పగిలిందన్నారు. మరి ఇద్దరి మధ్య గొడవేంటి అనేది చూస్తే.. ప్రభాస్‌.. గోపీచంద్‌ వ్యక్తిత్వం గురించి బాలయ్యకి చెప్పారు. గోపీచంద్‌కి చాలా ఓపిక ఉంటుందట. ఏమాత్రం చిరాకు పడడని తెలిపాడు ప్రభాస్. ఈ సందర్భంగా తమ మధ్య జరిగిన విషయం బయటపెట్టాడు.

38

 ఓ సారి షూటింగ్‌లో గోపీచంద్‌కి గాయమైందట. ప్రభాస్‌కి నవ్వితే మనుషులను నెట్టే అలవాటు ఉందట. గోపీచంద్‌ని అలా తరచూ నెట్టుతుండటం, కొట్టడం చేస్తుంటాడట. అయితే ఆ రోజు అప్పటికే గోపీచంద్‌ ముక్కు పగిలిందట. దీంతో ముందే చెప్పాడట. అరేయ్‌ ఈ రోజు నవ్వితే కొట్టొద్దు జాగ్రత్తగా ఉండాలని చెప్పాడట. కానీ డార్లింగ్‌ ఆ విషయం మర్చిపోయాడట. 

48

కారులో వెళ్తున్న క్రమంలో ఏదో జోక్‌ వస్తే ఇద్దరు తెగనవ్వుకున్నారు. ఆ జోష్‌లో గోపీచంద్‌ని కొట్టాడట ప్రభాస్. దెబ్బకి ముక్కు నుంచి రక్తం వస్తుందట. అయినా గోపీచంద్‌ చిరాకు పడలేదట. ముక్కు నుంచి కారుతున్న రక్తాన్ని తుడుచుకుంటూ `అరేయ్‌ ఏంట్రా ఇది, కొంచెం చూసుకోరా` అని మాత్రమే అన్నాడట. పాపం మంచోడు సర్‌, చిరాకు రాదు సర్‌ అని బాలయ్యకి అసలు విషయం చెప్పాడు ప్రభాస్‌. 
 

58

బాలయ్య హోస్ట్ గా, అన్‌స్టాపబుల్‌ షో రన్‌ అయిన విషయం తెలిసిందే. రెండో సీజన్‌లో ప్రభాస్‌, గోపీచంద్‌ కలిసి పాల్గొన్నారు. ఇందులో అసలు విషయం చెప్పాడు డార్లింగ్‌. గోపీచంద్‌ గొప్ప మనసుని, తమ మధ్య బాండింగ్‌ని వెల్లడించారు. ఈ వీడియో క్లిప్‌ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. ఫ్యాన్స్ ని తెగ ఆకట్టుకుంటుంది. 
 

68
Gopichand bheema

ప్రముఖ దర్శకుడు టీ కృష్ణ కొడుకు అని హీరో గోపీచంద్‌ `తొలి వలపు`చిత్రంతో హీరోగా పరిచయం అయ్యాడు. ఈ మూవీ ఆకట్టుకోలేదు. దీంతో విలన్‌గా టర్న్ తీసుకున్నాడు. వరుసగా `జయం`, `నిజం`, `వర్షం` చిత్రాల్లో విలన్‌గా చేశాడు. దర్శకుడు తేజ సినిమాల్లో విలన్‌గా మెప్పించారు. `వర్షం` తర్వాత హీరోగా టర్న్ తీసుకున్నారు. `యజ్ఞం` చిత్రంతో హీరోగా హిట్‌ కొట్టాడు. వరుసగా హీరోగా సినిమాలు చేస్తూ వస్తున్నారు. 

78

`ఆంధ్రుడు`, `రణం`, `లక్ష్యం`, `శౌర్యం`, `లౌక్యం`, `జిల్‌`, `గౌతమ్‌ నంద`, `సీటీ మార్‌` వంటి చిత్రాలతో విజయాలు అందుకుని స్టార్‌ హీరోగా ఎదిగాడు. ఇటీవల `భీమా` చిత్రంతో మరోసారి ఆకట్టుకున్నారు. ఇప్పుడు శ్రీనువైట్ల దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. దీనికి `విశ్వం` పేరుని అనుకుంటున్నారు. సరైన హిట్‌ కోసంచూస్తున్నారు గోపీచంద్‌.

88

ఇక ప్రభాస్‌ ప్రస్తుతం గ్లోబల్‌ స్టార్‌గా రాణిస్తున్నారు. ఆయన చేతిలో `కల్కి2898ఏడీ`, `ది రాజా సాబ్‌` చిత్రాలున్నాయి. `కన్నప్ప`లో గెస్ట్ రోల్‌ చేస్తున్నారు. మరోవైపు `సలార్‌ 2`, `స్పిరిట్‌`, హను రాఘవపూడి చిత్రాలు ప్రారంభించాల్సి ఉంటుంది. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories