వేశ్యగా హీరోయిన్లు.. అనసూయ, సదా, అనుష్క, శ్రియా, రమ్యకృష్ణ, శృతి హాసన్‌, స్నేహ.. వామ్మో బోల్డ్ గా ఊపేసిన భామలు

Published : Aug 02, 2023, 05:24 PM IST

మన అందాల భామలు వేశ్యలుగానూ నటించి మెప్పించారు. ఇప్పుడు అనసూయ చేస్తుంది, అంతకు ముందు అనేక మంది స్టార్‌ హీరోయిన్లు వేశ్యలుగా నటించి మెప్పించారు. ఆ కథేంటో చూద్దాం. 

PREV
111
వేశ్యగా హీరోయిన్లు.. అనసూయ, సదా, అనుష్క, శ్రియా, రమ్యకృష్ణ, శృతి హాసన్‌, స్నేహ.. వామ్మో బోల్డ్ గా ఊపేసిన భామలు

వేశ్యలు అంటే సమాజంలో చిన్నచూపు ఉంది. వారిని నీచంగా చూస్తుంటారు. కానీ వారిదీ ఓ వృత్తే. తమ జీవనం కోసం ఆ వృత్తిలో కొనసాగుతుంటారు. అలాంటి పాత్రలు సినిమాల్లో చేయడం సాహసమనే చెప్పాలి. అందరు హీరోయిన్లు అలాంటి పాత్రలు చేసేందుకు ఆసక్తి చూపరు. చేసే వారికి గట్స్ ఉండాల్సిందే. మరి మన తెలుగు అందాల భామలు వేశ్య పాత్రల్లో నటించి మెప్పించారు. నటనతో రచ్చ చేశారు. ఎవరెవరు ఏ ఏ సినిమాలు చేశారో తెలుసుకుందాం. 
 

211

హాట్‌ యాంకర్‌గా బుల్లితెరపై పాపులర్ అయ్యింది అనసూయ. ఇప్పుడు సినిమాల్లో ఫుల్‌ బిజీగా ఉంది. నటనకు స్కోప్‌ ఉన్న ఎలాంటి పాత్రల్లోనైనా నటించేందుకు సిద్ధంగా ఉంటుంది. ఇటీవల `విమానం` సినిమాలో వేశ్యగా నటించింది. మంచి పేరుతెచ్చుకుంది. ఇప్పుడు ప్రభుదేవా నటించిన `వుల్ఫ` చిత్రంలోనూ ఆమె వేశ్యగా నటిస్తుందట. ఆ మధ్య `విమానం` ప్రమోషన్స్ లో ఈ విషయాన్ని వెల్లడించింది అనసూయ. తాజాగా `వుల్ఫ` తెలుగు టైటిల్‌ని ప్రకటించిన విషయం తెలిసిందే. 

311

ఇక టాలీవుడ్‌లో వేశ్య పాత్రల్లో నటించి వారిలో అనుష్క పేరు ప్రధానంగా వినిపిస్తుంది. ఆమె `వేదం` సినిమాలో వేశ్యగా కనిపించి మెప్పించింది. బాడీ లాంగ్వేజ్ నుండి మొదలుకుని ఆమె ఎమోషన్స్ ఎక్స్‌ ప్రెషన్స్ వరకు అన్నింటిలో కూడా అనుష్క వావ్‌ అనిపించింది. ఆ సినిమా అనుష్కకి మంచి పేరుతెచ్చింది. సినిమా కూడా క్రిటికల్‌గా ప్రశంసలందుకుంది. 

411

టాలీవుడ్‌లో హాట్‌ హీరోయిన్‌గా పేరుతెచ్చుకుంది శ్రియా. టాలీవుడ్‌ని ఓఊపు ఊపేసిన ఈ భామ ఇప్పుడు అడపాదడపా సినిమాలు చేస్తుంది. అయితే ఈ అమ్మడు కూడా వేశ్యగా మెరిసింది. `పవిత్ర` సినిమాలో శ్రియ వేశ్యగా నటించి నటిగా తన స్థాయిని పెంచుకుంది. అందులో శ్రియ అందాల ఆరబోతతోపాటు నటన వాహ్‌ అనిపించేలా ఉంటుంది. 

511

స్టార్‌ హీరోయిన్‌గా రాణిస్తున్న కమల్‌ తనయ శృతి హాసన్ కూడా వేశ్యగా కనిపించింది. హిందీలో రూపొందిన `డీడే` చిత్రంలో ఆమె పాకిస్తాన్‌ కి చెందిన వేశ్యగా కనిపించి మెప్పించింది. ఈ సినిమా మాఫియా డాన్‌ దావూద్ ఇబ్రహీం కథతో తెరకెక్కించారు.
 

611

గ్లామర్ పాత్రలకు, బోల్డ్ రోల్స్ కి కేరాఫ్‌గా నిలిచింది రమ్యకృష్ణ. నటనతో విశ్వరూపం చూపించే ఈ ముదురు భామ లేటు వయసులో వేశ్యగా మెప్పించడం విశేషం. తమిళ చిత్రం `సూపర్‌ డీలక్స్`  రమ్యకృష్ణ వేశ్యగా కనిపించింది. దీనికి విమర్శకుల ప్రశంసలు దక్కించుకోవడంతో పాటు ప్రేక్షకుల మన్ననలు పొందింది. అంతకు ముందు కమల్‌ హాసన్‌ తీసిన `పంచతంత్రం`లోనూ ఆమె పాత్ర వేశ్యగానే ఉంటుంది.

711

హీరోయిన్ గా స్టార్ ఇమేజ్‌ పొందలేకపోయిన హీరోయిన్‌ సంగీత పెళ్లి చేసుకుని సెటిల్‌ అయ్యింది. కొంత గ్యాప్‌తో మళ్లీ సినిమాలు చేస్తుంది. అయితే ఈ అమ్మడు కూడా వేశ్యగా నటించింది. తమిళంలో `ధనం` చిత్రంలో వేశ్యగా మెరిసింది.  

811

`ఆవకాయ్ బిర్యానీ` చిత్రం ద్వారా హీరోయిన్ గా పరిచయం అయిన తెలుగు నటి బింధు మాధవి 2011లో వచ్చిన గౌతం మీనన్ చిత్రం `సెగ`లో వేశ్య పాత్ర పోషించింది. సినిమా పెద్దగా ఆడక పోయినా బింధుమాధవికి మాత్రం మంచి మార్కులు పడ్డాయి.

911

`జ్యోతి లక్ష్మి`, `ప్రేమ ఒక కావ్యం` సినిమాల్లో హాట్ బ్యూటీ  ఛార్మి కూడా వేశ్యగా కనిపించింది. ఒకప్పుడు స్టార్‌ హీరోయిన్‌గా రాణించిన ఛార్మి ఇప్పుడు నిర్మాతగా మారి పూరీ జగన్నాథ్‌తో సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే.
 

1011

హోమ్లీ హీరోయిన్ స్నేహ వేశ్యగా నటించి ఊహించని షాక్ ఇచ్చారు. 2006లో ధనుష్ హీరోగా విడుదలైన `ధూల్ పేట్` మూవీలో స్నేహ వేశ్య పాత్ర చేశారు. స్నేహ నుంచి ఇలాంటి రోల్‌ని ఊహించడం కష్టమే అయినా చేసి మెప్పించిందీ అమ్మడు.

1111

వీరితోపాటు పలువురు ముద్దుగుమ్మలు వేశ్యలుగా కనిపించి మెప్పించారు. `ప్యూర్‌ సోల్‌` అనే షార్ట్‌ ఫిల్మ్‌ లో శ్రద్దా దాస్ వేశ్యగా కనిపిస్తే, `మెట్రో కథలు` వెబ్‌ సిరీస్ లో బిగ్ బాస్ ముద్దుగుమ్మ నందిని రాయ్‌.. `ముతోన్‌` అనే మలయాళ సినిమాలో తెలుగమ్మాయి శోభిత దూళిపాల, `కమలతో నా ప్రయాణం` సినిమాలో అర్చన, `టార్చ్ లైట్` అనే తమిళ సినిమాలో సదా వేశ్యలుగా నటించి మెప్పించారు.
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories