దర్శకుడు ధీరుడు రాజమౌళి(Rajamouli)తో సినిమా అనే ఇండస్ట్రీ హిట్టే. ఆయనతో సినిమా చేసిన ప్రతి హీరో కెరీర్ బెస్ట్ నమోదు చేసుకుంటారు. అయితే ఆ తర్వాత బోల్తా కొడతారు. రాజమౌళితో సినిమా చేసి భారీ హిట్స్ కొట్టిన హీరోలు తమ నెక్స్ట్ మూవీతో అట్టర్ ప్లాప్ రుచి చూస్తారు. కమెడియన్ సునీల్ నుండి ఎన్టీఆర్ వరకు ఈ సెంటిమెంట్ వదలకుండా వెంటాడింది. బాహుబలి సిరీస్ తర్వాత ప్రభాస్ చేసిన సాహో, రాధే శ్యామ్ ఫలితం మనకు తెలిసిందే. ఆర్ ఆర్ ఆర్ రూపంలో చరణ్ కి పాన్ ఇండియా హిట్ ఇచ్చాడు రాజమౌళి. మరి ఆర్ ఆర్ ఆర్ (RRR Movie)తర్వాత చరణ్ చేస్తున్న ఆచార్యను రాజమౌళి ఫ్లాప్ సెంటిమెంట్ వెంటాడితే దారుణమైన ఫలితం చూడాలి.