మహేష్ తో ఇప్పటికే జతకట్టిన ఈ అమ్మడు, ప్రభాస్ పక్కన కూడా ఛాన్స్ కొట్టేశారు. ఆ చిత్రం ఇప్పుడు సెట్స్ పైన ఉంది. అయితే పూజా కావచ్చు అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే.
అప్పటి ఈ క్యూట్ బేబీ ఇప్పటి హాట్ హీరోయిన్.. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరంటే కృతి సనన్. నాన్నతో పాటు అమాయకంగా ఫోటోలకు ఫోజిచ్చిన ఈ అమ్మడు కృతిసనన్. నాన్న రాహుల్ సనన్ బర్త్ డే సందర్భంగా, ఆయనతో తన చిన్ననాటి ఫోటోలు కృతి పంచుకున్నారు.
ముగ్గురు అల్లరి ఆడపిల్లలను ఎంతో సహనంతో పెంచారు నాన్న.. ప్రపంచంలో నేను అందరికంటే ప్రేమించే వ్యక్తి మీరేనంటూ కృతి తండ్రి రాహుల్ కి బర్త్ డే విషెష్ తెలియజేసింది.
ఇక 2014లో మహేష్-సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన వన్ నేనొక్కడినే చిత్రంలో కృతి సనన్ హీరోయిన్ గా నటించారు. అలాగే నాగ చైతన్యకు జంటగా దోచేయ్ మూవీలో చేశారు.
ప్రస్తుతం ప్రభాస్ హీరోగా దర్శకుడు ఓమ్ రౌత్ తెరకెక్కిస్తున్న మైథలాజికల్ మూవీ ఆదిపురుష్ లో సీత పాత్ర చేస్తున్నారు కృతి. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా వెలువడింది.
దీనితో చాలా కాలం తరువాత మరలా తెలుగులో కృతి మూవీ చేస్తున్నట్లు అయ్యింది. మహేష్ తో ఆమె చేసిన వన్ ఆమెకు మొదటి చిత్రం కావడం విశేషం.
ప్రస్తుతం బాలీవుడ్ లో కృతికి వరుస ఆఫర్స్ వస్తున్నాయి. బచ్చన్ పాండే మూవీలో అక్షయ్ కుమార్ కి జంటగా నటిస్తున్న కృతి, రాజ్ కుమార్ రావ్ హీరోగా తెరకెక్కుతున్న హమ్ దో హమారే దో మూవీలో నటిస్తున్నారు.
అలాగే మరో రెండు హిందీ చిత్రాలలో కృతి సనన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇక ఆదిపురుష్ మూవీ వచ్చే ఏడాది శ్రీరామనవమి కానుకగా విడుదల కానుందని ప్రచారం సాగుతుంది.