ప్రభాస్ కి పెళ్లంటే భయం... కారణం ఓ అమ్మాయి మోసం... షాకింగ్ విషయాలు వెల్లడించిన తల్లి?

First Published Aug 20, 2022, 7:06 PM IST


42 ఏళ్ల ప్రభాస్ పెళ్లి మాటెత్తడం లేదు. అసలు చేసుకుంటాడో లేదో తెలియదు.తన కంటే వయసులో చిన్నవాళ్ళైన ఎన్టీఆర్, అల్లు అర్జున్ పెళ్లిళ్లు చేసుకొని ఇద్దరు పిల్లలకు పేరెంట్స్ అయ్యారు. 
 

Prabhas


స్టార్ డమ్, సంపాదనలో అందరికంటే ఓ మెట్టు పైనున్న ప్రభాస్ కి పెళ్లి పట్ల ఈ వైరాగ్యం ఏమిటనే సందేహం ఎప్పటి నుండో అందరి మెదళ్ళు తొలిచేస్తోంది. ఎట్టకేలకు దీనిపై ఓ క్లారిటీ వచ్చింది. ప్రభాస్ వివాహం చేసుకోకపోవడానికి కారణం ఇదే అంటూ ఓ వార్త తెరపైకి వచ్చింది.  

దశాబ్దకాలంగా ప్రభాస్ పెళ్లి ఎవర్ గ్రీన్ హాట్ టాపిక్ గా ఉంది. ఈ పదేళ్ల కాలంలో వందల కొద్ది పుకార్లు పుట్టుకొచ్చాయి. పరిశ్రమతో సంబందం లేని అమ్మాయిలతో పాటు కొందరు హీరోయిన్స్ పేర్లు కూడా తెరపైకి వచ్చాయి. ప్రముఖంగా అనుష్క శెట్టి పేరు వినిపించింది. వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారు, త్వరలో వివాహం చేసుకోనున్నారని కథనాలు వెలువడ్డాయి. ఇద్దరూ కలిసి నాలుగు చిత్రాలు చేయడంతో పాటు సింగిల్ స్టేటస్ కావడంతో ఈ పుకార్లకు బలం చేకూరింది.


ఈ కథనాలను అనుష్క, ప్రభాస్ కొట్టిపారేశారు. మేము స్నేహితులం మాత్రమే అంటూ స్పష్టత ఇచ్చారు. బాహుబలి 2 విడుదలయ్యాక ప్రభాస్ మ్యారేజ్ ఉంటుందనే ప్రచారం కూడా జరిగింది. 2017లో ఆ మూవీ విడుదల కాగా ఇప్పటికి ఐదేళ్లు గడిచిపోయాయి. 
 

Prabhas

మనసులో గట్టిగా చేసుకోవాలనే సంకల్పం ఉంటే ఎలాగైనా జరిగిపోతుంది. ప్రభాస్ పెళ్లి విషయంలో అసలు సమస్య అక్కడే వచ్చిందట. ఆయనకు పెళ్లి చేసుకునే ఆలోచన లేదని, ఓ వ్యక్తి కారణంగా ప్రభాస్ ఈ ఆలోచనకు వచ్చారని తాజా సమాచారం. ఈ విషయాన్ని ప్రభాస్ తల్లి శివకుమారి స్వయంగా సన్నిహితులతో చెప్పారట. ప్రభాస్ ఇంత వయసొచ్చినా పెళ్లి చేసుకోకపోవడానికి కారణం ఇదే అంటూ ఆమె వెల్లడించారట.

నిన్న హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ పార్టీకి వెళ్లిన ప్రభాస్ బ్లాక్ షర్ట్, క్యాప్,  గాగుల్స్ పెట్టుకొని నయా లుక్ ను సొంతం చేసుకున్నాడు. ఇన్ షర్ట్ వేసి అదిరిపోయే కటౌట్ లో ఆకట్టుకుంటున్నారు. కొద్ది రోజుల నుంచి ప్రభాస్ ఇదే స్టైల్ లో కనిపిస్తూ అభిమానులకు ఐఫీస్ట్ కలిగిస్తున్నాయి. చాలా అరుదుగా కనిపిస్తున్న ప్రభాస్ తన ఫ్యాన్స్ లో న్యూలుక్ తో జోష్ నింపుతున్నారు.  
 


ప్రభాస్ కి రవి అనే ప్రాణమిత్రుడు ఉన్నాడు. ఎంత బిజీగా ఉన్న ప్రతి రోజూ అతనితో ఫోన్ లో మాట్లాడతాడట.  అతడు 45 ఏళ్ళు వచ్చినా వివాహం చేసుకోలేదు. ఓ అమ్మాయిని ప్రేమించి మోసపోయిన రవి ప్రేమ, పెళ్లి, అమ్మాయిల పట్ల ద్వేషం పెంచుకున్నాడు. రవిని కలిసినప్పుడల్లా అతడు ప్రభాస్ తో పెళ్లి గురించి నెగిటివ్ కామెంట్స్ చేసేవాడట. ఆ క్రమంలో ప్రభాస్ కి కూడా పెళ్లిపై ఇష్టం పోయిందని... శివ కుమారి సన్నిహితలతో వాపోయారట. 


అయితే ఎలాగైనా ప్రభాస్ ని ఒప్పించి వివాహం చేస్తామని ఆమె చెప్పారట. ప్రచారం అవుతున్న ఈ వార్తలో నిజమెంత ఉందో తెలియదు కానీ ప్రముఖంగా ప్రచారం అవుతుంది. మరోవైపు ప్రభాస్ మూడు చిత్రాలతో బిజీగా ఉన్నారు. సలార్, ప్రాజెక్ట్ కే చిత్రీకరణ దశలో ఉండగా... ఆదిపురుష్ డబ్బింగ్ జరుపుకుంటుంది. వచ్చే ఏడాది ప్రభాస్ నటించిన ఆదిపురుష్, సలార్ విడుదల కానున్నాయి. 

వీటితో పాటు మారుతి దర్శకత్వంలో ఓ మూవీ, అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగాతో స్పిరిట్ అనే చిత్రం ప్రభాస్ ప్రకటించారు. వచ్చే నాలుగైదేళ్ళ ఆయన చాలా బిజీగా ఉంటారు. ఈ క్రమంలో ఆయన పెళ్ళికి సమయం కేటాయిస్తారా లేదా అనేది చూడాలి.42 ఏళ్ల ప్రభాస్ పెళ్లి మాటెత్తడం లేదు. అసలు చేసుకుంటాడో లేదో తెలియదు.తన కంటే వయసులో చిన్నవాళ్ళైన ఎన్టీఆర్, అల్లు అర్జున్ పెళ్లిళ్లు చేసుకొని ఇద్దరు పిల్లలకు పేరెంట్స్ అయ్యారు. 
 

click me!