ఫైనల్లీ ఇలియానా బాయ్ ఫ్రెండ్ ఎవరో తెలిసింది... పెళ్లి కూడా చేసుకున్నారా!

First Published | Aug 8, 2023, 8:43 AM IST

పెళ్లి కాకుండా తల్లి అయ్యానని ప్రకటించి ఇలియానా అతిపెద్ద సర్ప్రైజ్ కి తెరలేపిన విషయం తెలిసిందే. తాజాగా ఆమె బిడ్డను కూడా కన్నారు. ఇలియానాతో సహజీవనం చేసిన ప్రియుడు వివరాలు కొన్ని బయటకు వచ్చాయి... 
 

ఇలియానా గర్భానికి కారణం ఎవరో తెలియక జనాలు సందిగ్ధత అనుభవించారు. తల్లైన ఇలియానా బాయ్ ఫ్రెండ్ వివరాలు వెల్లడించ లేదు. ఆ మధ్య సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. తల్లి కావడం గొప్ప విషయం. మన శరీరంలో ఓ ప్రాణికి జీవం పోయడం గొప్ప అనుభూతిని పంచిందన్నారు.  అలాగే తనకు కష్టనష్టాల్లో ఒక వ్యక్తి తోడున్నాడని, వేదన నుండి బయటపడేలా చేశాడని ఇలియానా తెలిపింది. అండగా నిలిచి జీవితంలో నవ్వులు పూయించాడని ఇలియానా అన్నారు. 

అయితే ఆ వ్యక్తి పేరు ఇలియానా చెప్పలేదు. లైఫ్ లో అత్యంత ముఖ్యమైన వ్యక్తిగా కొనియాడారు. ఆయనపై అభిమానం, ప్రేమ చాటుకున్నారు. సస్పెన్సు కొనసాగుతుండగా అనంతరం ఫోటో షేర్ చేసింది. అతన్ని చూసి ఎవరో విదేశీయుడు అని మాత్రం అర్థమవుతుంది.
 


ఇక ఆగస్టు 1న ఇలియానా కొడుకును కన్నారు. అబ్బాయికి కోయ ఫీనిక్స్ డోలన్ అని పేరు పెట్టింది. సోషల్ మీడియాలో తన కొడుకు ఫోటో పోస్ట్ చేసింది. దీంతో ఆమెకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. కాగా ఇలియానా తన పార్ట్నర్ వివరాలు చెప్పకున్నప్పటికీ కొంత సమాచారం అందుతుంది. 

అతని పేరు మైఖేల్ డోలన్ అట. వీరు వివాహం కూడా చేసుకున్నారట. ఇలియానా తల్లైన తర్వాత పెళ్లి జరిగిందట. మే 13న ఇలియానా-మైఖేల్ డోలన్ చర్చిలో నిరాడంబరంగా వివాహం చేసుకున్నట్లు సమాచారం. అంతకు ముందే ఇలియానా ఏప్రిల్ 18న గర్భం దాల్చిన విషయం వెల్లడించారు. మైఖేల్ గురించిన పూర్తి సమాచారం ఇంకా అందాల్సి ఉంది. 

గతంలో ఇలియానా ఆస్ట్రేలియన్ వ్యక్తితో డేటింగ్ చేసింది. 2019లో అతడితో విడిపోయింది.  లవ్ బ్రేకప్ అనంతరం ఇలియానా డిప్రెషన్ కి గురైంది. ఈ క్రమంలో ఆమె బరువు పెరిగింది. ఒక దశలో ఇలియానా షేప్ అవుట్ అయ్యారు. మానసిక సమస్యలు ఎదుర్కొన్నారు. 


ఇక ఇలియానా కెరీర్ ఫేడ్ అవుట్ దశలో ఉంది. తెలుగులో ఆమె స్టార్ గా వెలిగిపోయింది. పోకిరి మూవీతో ఇండస్ట్రీ హిట్ కొట్టిన ఇలియానా ఓవర్ నైట్ స్టార్ అయ్యింది. సౌత్ ని ఏలుతున్న టైంలో నార్త్ పై కన్నేసి కెరీర్ నాశనం చేసుకుంది. 
 

Latest Videos

click me!