ET Movie Review: `ఈటీ` మూవీ ట్విట్టర్‌ టాక్‌.. సూర్య మాస్‌ జాతరే.. హ్యాట్రిక్‌ పక్కా

First Published | Mar 10, 2022, 7:21 AM IST

`ఆకాశం నీ హద్దురా`, `జై భీమ్‌` చిత్రాల తర్వాత దాదాపు మూడేళ్ల గ్యాప్‌తో సూర్య థియేటర్‌కి వస్తున్న చిత్రం `ఈటీ`(ఎవరికి తలవంచడు). పాండిరాజ్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రమిది. ప్రియాంక అరుల్‌ మోహన్‌ హీరోయిన్‌గా నటించింది. సినిమా గురువారం(మార్చి 10)న విడుదలైంది. సినిమా ఎలా ఉందనేది ట్విట్టర్‌ టాక్‌ ద్వారా తెలుసుకుందాం. 

హీరో సూర్య వరుస హిట్లతో దూసుకుపోతున్నారు. రియల్‌ లైఫ్‌ ఇన్స్ డెన్స్ ఆధారంగా నటించిన `ఆకాశం నీ హద్దురా`, `జై భీమ్‌` చిత్రాలు బాక్సాఫీసు వద్ద సంచలన విజయాలు సాధించాయి. దేశ వ్యాప్తంగా మంచి ప్రశంసలందుకున్నాయి. `జై భీమ్‌` మూవీ ఏకంగా ఐఎండీబీ ఇచ్చే రేటింగ్‌లో ప్రపంచ వ్యాప్తంగా టాప్‌ ప్లేస్‌లో నిలిచింది. అయితే ఈ రెండు చిత్రాలు కరోనా కారణంగా ఓటీటీలో విడుదలయ్యాయి. అయినా క్రిటికల్‌గా, కమర్షియల్‌గా సక్సెస్‌ సాధించాయి. దాదాపు మూడేళ్ల తర్వాత సూర్య థియేటర్‌కి వస్తున్న చిత్రం `ఈటీ`(ఎవరికి తలవంచడు). పాండిరాజ్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రమిది. ప్రియాంక అరుల్‌ మోహన్‌ హీరోయిన్‌గా నటించింది. తమిళంలో రూపొందిన ఈ చిత్రాన్ని తెలుగులో డబ్‌ చేసి రిలీజ్‌ చేస్తున్నారు.
 

అభిమానులు సూర్యని థియేటర్‌లో చూడాలనుకుంటున్న కోరిక ఈ చిత్రంతో తీరబోతుంది. ఈ చిత్రం గ్రాండ్‌గా తమిళంతోపాటు తెలుగులో కూడా విడుదల కాబోతుంది. అయితే తెలుగులో సూర్య స్వయంగా డబ్బింగ్‌ చెప్పడం విశేషం. దీంతో తెలుగులోనూ ఈ చిత్రంపై అంచనాలున్నాయి. గురువారం(మార్చి 10)న విడుదలవుతుంది. అయితే ఈ ఉదయం నుంచే అమెరికాలో ప్రీమియర్స్ షోస్‌ రన్‌ అవుతున్నాయి. మరి సినిమాకి సోషల్‌ మీడియాలో ఎలాంటి రియాక్షన్‌ వస్తోంది. ట్విట్టర్‌లో నెటిజన్లు ఏమంటున్నారనేది `ఈటీ ట్విట్టర్‌ రివ్యూ`(ET Movie Review)లో తెలుసుకుందాం. 


ఇంటర్వెల్‌ సీన్‌ సినిమాకి హైలైట్‌గా నిలుస్తుందని అంటున్నారు ఫ్యాన్స్. ఫస్టాఫ్‌ మాస్‌ జాతరే అంటున్నారు. ఇక సెకండాఫ్‌ డీసెంట్‌గా సాగుతుందట. కచ్చితంగా సినిమా బ్లాక్‌ బస్టర్ అని తమ అభిప్రాయాన్ని పంచుకుంటున్నారు. అయితే సినిమాలో మహిళలకు సంబంధించిన అంశాలు చాలా బాగున్నాయని, పర్‌ఫెక్ట్ ఉమెన్స్ డే గిఫ్ట్ అంటున్నారు. మాస్‌ హీరో ఇలాంటి సినిమా చేయడం గొప్ప విషయంగా ఆడియెన్స్ చెబుతున్నారు. ET Movie Review.

ట్విట్టర్‌లో నెటిజన్లు చెబుతున్నదాని ప్రకారం సినిమా హిట్‌ టాక్‌ వస్తుంది. ఫస్టాఫ్‌ అదిరిపోయిందంటున్నారు. మాస్‌ ఓపెనింగ్‌ సీక్వెన్స్ లు, మాస్‌ ఇంటర్వెల్‌ బాగున్నాయట. సూర్య ఫామ్‌ కొనసాగుతుందని, తెరపై చాలా బాగా కనిపించారని చెబుతున్నారు. ఇదొక మంచి ఫ్యామిలీ మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఉంటుందట. ఇంటర్వల్‌ సూపర్‌గా ఉందని పోస్టులు పెడుతున్నారు. దర్శకుడు పాండిరాజ్‌సినిమాని విలేజ్‌ బ్యాక్‌ డ్రాప్‌లో బాగా డిజైన్‌ చేశాడట. మంచి ప్రయత్నమని ప్రశంసలు దక్కడం విశేషం. 

సినిమాలో రామ్‌-లక్ష్మణ్‌ మాస్టర్స్ ఫైట్స్ సీక్వెన్స్ వేరే లెవల్‌ అని, ఇంటర్వెల్‌ వచ్చే ఫైట్‌ పూనకాలు తెప్పిస్తుందట. ఇంట్రో సీన్స్ గూస్‌బంమ్స్ తెప్పిస్తాయట. అయితే ఇందులో మంచి ఫన్‌ కూడా ఉందని చెప్పడం విశేషం. సూర్య ఫ్యాన్స్ కి, ఫ్యామిలీ ఆడియెన్స్ కి మంచి ట్రీట్‌ అంటున్నారు యూఎస్‌ ఆడియెన్స్. `ఈటీ` సినిమా ఫుల్‌ ఫ్యాక్డ్ ఎంటర్‌టైనర్‌గా చెబుతున్నారు కొందరు నెటిజన్లు. `ఈటీ`లో ఇంట్రో, ఇంటర్వెల్‌ ఎపిసోడ్‌, సూర్య స్క్రీన్‌ ప్రజెన్స్, బీజీఎం, కెమెరా వర్క్ అద్భుతంగా ఉన్నాయట. సత్యరాజ్‌, శరణ్యల కామెడీ నవ్వులు పూయిస్తుందట. లవ్‌, కామెడీ, ఫ్యామిలీ, యాక్షన్‌ మేళవించిన చిత్రమంటున్నారు. 

సినిమా ప్రధానంగా మహిళ ప్రధానంగా సాగుతుంది. మన చుట్టుపక్కల ఉన్న మహిళల పట్ల మనం ఎలాంటి స్త్రీ ద్వేషంతో వ్యవహరిస్తామో తెలియజేసే చిత్రమిదని అంటున్నారు. వాళ్లే ప్రతిసారి సర్దుకుపోవాలని మగవాళ్లు ఆశిస్తుంటారు. నీళ్లు తీసుకురావాలన్నా, టీ ఇవ్వాలన్నా, భోజనం వడ్డించాలన్నా స్త్రీలకే చెబుతుంటాం. మగవాళ్లు ఎందుకు ఆ పని చేయరనే ప్రశ్నతో ఈసినిమా సాగుతుందట. తెలుగు రాష్ట్రాల్లో, తమిళనాడులోని ప్రతి ఇంట్లో ఇలాంటి సంఘటలు జరుగుతుంటాయని, దీంతో సినిమా ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుందని యూనిట్‌ చెప్పిన విషయం తెలిసిందే. 

సూర్య నటించిన `ఈటీ` చిత్రానికి యూఎస్‌ ఆడియెన్స్ నుంచి పాజిటివ్‌రెస్పాన్స్ వస్తుంది. బ్లాక్‌ బస్టర్‌ రిపోర్ట్ అందుతుంది. మరి నిజంగా సినిమా ఎలా ఉంది. మన ఆడియెన్స్ కి నచ్చిందా లేదా? అనేది మరి కాసేపట్లో వచ్చే `ఏషియానెట్‌` రివ్యూలో తెలుసుకుందాం. 

Latest Videos

click me!