అలనాటి తార వాణి శ్రీ కూడా డస్కీ బ్యూటీనే. ఆమె తన మేకప్పే తన అందమని, అదే నాకు లైఫ్ ఇచ్చిందని అనేక సందర్భాల్లో చెప్పింది. ఇప్పుడు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ, భాష ఏదైనా కలర్ కంటే టాలెంట్ ముఖ్యమని గుర్తిస్తున్నారు.
వైట్ అమ్మాయిలే కాదు, కాస్త కలర్ తగ్గినా, నటనతో మెస్మరైజ్ చేసే హీరోయిన్లు కావాలంటున్నారు. అందులో భాగంగానే పూజా హెగ్డే, అమలాపాల్, ఈషా రెబ్బా, నివేతా థామస్, నివేదా పేతురాజ్, అను ఇమ్మాన్యుయెల్, ఐశ్వర్యా రాజేష్, అమర్ణ బాలమురళీ వంటి డస్కీ బ్యూటీస్ సౌత్ ఇండస్ట్రీలను ఓ ఊపు ఊపేస్తున్నారు.
ప్రస్తుతం డస్కీ బ్యూటీస్‌లో స్టార్‌గా రాణిస్తున్న హీరోయిన్లలో పూజా హెగ్డే ముందుంటారు. ఈ భామ ఇప్పుడు టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్. బాలీవుడ్‌లోనూ ఆకట్టుకుంటోంది. `డీజే`, `మహర్షి`, `అరవింద సమేత`, `అల వైకుంఠపురములో` వంటి చిత్రాల్లో నటించి సూపర్ హిట్లు అందుకుంది. టాలీవుడ్ టాప్ హీరోయిన్‌గా నిలిచింది.
పూజా హెగ్డే ఇప్పుడు లక్కీ హీరోయిన్. ఈ అమ్మడిని పెట్టుకుంటే సినిమా హిట్ అనే నానుడి ఉంది. అంతగా తన గ్లామర్‌తోనే కాదు, నటనటతోనూ మెస్మరైజ్ చేస్తుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ ప్రభాస్‌తో `రాధేశ్యామ్`, అఖిల్‌తో `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్`, రామ్‌చరణ్‌తో `ఆచార్య` చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది.
డస్కీ బ్యూటీస్‌లో తెలుగు అందం ఈషా రెబ్బాకూడా ఉంటుంది. ఈ అమ్మడు తెలుగమ్మాయి కావడం వల్ల అంతగా అనుకున్న స్థాయిలో అవకాశాలను దక్కించుకోలేకపోతుంది. కానీ టాలెంట్‌తో మాత్రం మెస్మరైజ్ చేసింది.
నటనతో, హాట్ అందాలతో కనువిందు చేస్తుంది. `అంతకు ముందు ఆ తర్వాత`, `బందిపోటు`, `అమీ తుమీ`, `దర్శకుడు`, `అ!`, `అరవింద సమేత`, `పిట్టకథలు`, `రాగల 24గంటల్లో` వంటి చిత్రాల్లో నటించి నటిగా మంచి పేరు తెచ్చుకుంది ఈషా. ప్రస్తుతం `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్`, తమిళంలో రెండు సినిమాలు చేస్తుంది.
ఇటీవల `వకీల్‌సాబ్`లో అద్భుతమైన నటనతో అందరిని ఫిదా చేసింది నివేతా థామస్. పవన్ తర్వాత అందరి చూపులను తనవైపు తిప్పుకున్న నటి నివేదానే కావడం విశేషం. ఈ చెన్నై బ్యూటీది కూడా డస్కీ అందమే.
`జెంటిల్‌మేన్` చిత్రంతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన నివేతా థామస్ తొలి సినిమాతోనే తెలుగు ఆడియెన్స్‌ని మెస్మరైజ్ చేసింది. `నిన్నుకోరి`, `జై లవకుశ`, `118`, `బ్రోచేవారెవరురా`, `దర్బార్`,`వి` చిత్రాల్లో నటించి తనదైన అద్భుతమైన నటనతో ఫిదా చేసింది. సినిమాల్లో రాణించేందుకు కలర్ ముఖ్యం కాదు, నటనే ఇంపార్టెంట్ అని నిరూపించింది.
కోలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా రాణిస్తున్న ఐశ్వర్యా రాజేష్ తెలుగమ్మాయి కావడం విశేషం. ఈ బ్యూటీ తమిళంలో స్టార్ హీరోయిన్ రాణిస్తుంది. నయనతార తర్వాత లేడీ ప్రధాన చిత్రాలకు తనే కేరాఫ్‌గా నిలుస్తుంది. కెరీర్ ప్రారంభం నుంచి నటనకు ప్రయారిటీ ఉన్న పాత్రల్లోనే నటిస్తూ వాహ్ అనిపిస్తుంది.
తమిళనాట పలు అవార్డులు కూడా అందుకుంది. ఇక తెలుగులో `కౌసల్య కృష్ణమూర్తి`, `మిస్ మ్యాచ్`, `వరల్డ్ ఫేమస్ లవర్` చిత్రాల్లో మెరిసింది. విజయ్ దేవరకొండతో నటించిన `వరల్డ్ ఫేమస్ లవర్`లో మధ్యతరగతి మహిళగా అద్భుతమైన నటనతో అలరించింది. ప్రస్తుతం తెలుగులో భారీ ఆఫర్స్ అందుకుంటోంది.ఇప్పుడు `రిపబ్లిక్`, `టక్ జగదీష్` చిత్రాల్లో నటిస్తుంది. `అయ్యప్పనుమ్ కోషియుమ్`లోనూ తనే హీరోయిన్ అని టాక్. ఇంతగా రాణిస్తున్న ఐశ్వర్య రాజేష్ డస్కీ బ్యూటీనే కావడం విశేషం. నటనకు కలర్ ఇంపార్టెంట్ కాదని నిరూపించిందీ బ్యూటీ.
తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం ఇలా ఏకకాలంలో నాలుగు చిత్ర పరిశ్రమల్లో సినిమాలు చేస్తూ కెరీర్‌ని బ్యాలెన్స్ చేస్తుంది అమలా పాల్. `ఇద్దరమ్మాయిలతో`, `బెజవాడ`, `నాయక్`, `జెండా పై కపిరాజు`, `పిట్టకథలు`తో తెలుగు ఆడియెన్స్ ని ఆకట్టుకుంది అమలాపాల్. సౌత్‌లో స్టార్ హీరోయిన్‌గా రాణిస్తున్న అమలాపాల్ డస్కీ బ్యూటీనే. తన కెరీర్‌కి కలర్ అడ్డు కాదని నిరూపించింది. అద్భుతమైన నటనతో మెస్మరైజ్ చేయగలనని నిరూపించింది.
ఇటీవల సూర్యతో `ఆకాశం నీ హద్దురా` చిత్రంలో నటించి అందరిని ఫిదా చేసింది అపర్ణ బాలమురళీ. కేరళాకి చెందిన ఈ భామ స్టార్ హీరోలతోనూ కలిసి నటించింది. మాయ చేసింది. తమిళం, మలయాళంలో స్టార్‌గా రాణిస్తుంది. కలర్ కాదు, నటనే ముఖ్యమని నిరూపిస్తుంది.
ఇటీవల బ్యాక్ టూ బ్యాక్ తెలుగులో మెరుస్తుంది నివేథా పేతురాజ్. `మెంటల్ మదిలో` చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చి తొలి చిత్రంతోనే స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచింది. `చిత్రలహరి`, `బ్రోచేవారెవరురా`, `రెడ్` చిత్రాల్లో మెరిసింది నివేతా.
ప్రస్తుతం `విరాటపర్వం`, `పాగల్`తోపాటు చందూ మొండేటి చిత్రంలో నటిస్తుంది. కలర్ కాదు, మంచి నటన ఉంటే చాలు అని తెలియజేసిందీ భామ. కుర్రాళ్ళ డ్రీమ్ గర్ల్ గానూ మారిపోయింది. డస్కీ బ్యూటీస్‌కి కూడా ఇక్కడ వాల్యూ ఉంటుందని నిరూపిస్తుంది.
మరో డస్కీ బ్యూటీ అను ఇమ్మాన్యుయెల్. ఈ అమ్మడి కెరీర్ తొలుత కాస్త అటుఇటుగా మారినా ఇప్పుడు మళ్లీ పుంజుకుంటోంది. వరుసగా బిగ్ ఆఫర్స్ దక్కించుకుంటోంది. అను కూడా డస్కీ బ్యూటీనే.
తెలుగులోకి `మజ్ను` చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. `కిట్టు ఉన్నాడు జాగ్రత్త`, `ఆక్సీజన్`, `నా పేరు సూర్య`, `శైలజా రెడ్డి అల్లుడు`, `అల్లుడు అదుర్స్` చిత్రాల్లో నటించి ఆకట్టుకుంది. ఇప్పుడు `మహాసముద్రం`లో హీరోయిన్‌గా చేస్తుంది.