జూనియర్ ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా.. రిలీజ్ అయిన కొత్త సినిమా డ్రాగన్ ప్రోమో రిలీజైంది. మొదట్లో ఈ సినిమాను 'NTRNeel' అనేవారు. 4.28 నిమిషాల ఈ ప్రోమోలో అతి పెద్ద తారా తోరణం కనిపించింది. 'డ్రాగన్' సినిమాలో ఎవరు ఏ పాత్ర చేస్తున్నారో చూద్దాం.
ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ 'లూగర్' పాత్ర పోషిస్తున్నారు. ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీకి ఇతనే ముఖ్య హంతకుడు (అసాసిన్-ఇన్-చీఫ్). ప్రోమో చూస్తే, ఈ పాత్ర ఎంత క్రూరమైనదో, ప్రమాదకరమైనదో అర్థమవుతుంది.
211
అనిల్ కపూర్
'డ్రాగన్'లో అనిల్ కపూర్ రఘువీర్ రాథోడ్ పాత్రలో కనిపించనున్నారు. ఈయన భారత నార్కోటిక్స్ బ్యూరో చీఫ్. అక్రమ వ్యాపార నెట్‌వర్క్‌పై పోరాటం చేసే అధికారి గా నటించారు.
311
'డ్రాగన్'లో రుక్మిణి వసంత్
'డ్రాగన్' ప్రోమోలో రుక్మిణి వసంత్ కనిపించినా, ఆమె పాత్ర ఏంటో రివీల్ చేయలేదు. కానీ, ప్రోమోలో ఆమె ఎన్టీఆర్ పాత్రను పరిచయం చేసింది. దీన్నిబట్టి చూస్తే, సినిమాలో ఆమె ఎన్టీఆర్‌కు దగ్గరి వ్యక్తి పాత్రలో కనిపించవచ్చని అనిపిస్తోంది.
'డ్రాగన్'లో బీజూ మోహన్‌ది ఒక ముఖ్యమైన పాత్ర. ఈ సినిమాలో ఆయన ఆఫ్ఘన్ లాజిస్టిక్స్ హెడ్‌గా కనిపించనున్నారు. ఇక ఈ సినిమాలోని 8 మంది విలన్లు ఉన్నట్టు ప్రకటించారు.
511
ఆశుతోష్ రాణా
ఈ సినిమాకు ఆశుతోష్ రాణా మెయిన్ విలన్. ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీ బాస్ 'దాదా ఠాకూర్' పాత్రలో ఆయన నటిస్తున్నారు. కథ మొత్తం ఆయన చుట్టునే తిరుగుతుంది.
611
అన్షుమాన్ పుష్కర్
అన్షుమాన్ పుష్కర్ 'డ్రాగన్'లో సుజోయ్ సర్కార్ పాత్రలో కనిపించనున్నారు. ఇతను ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీకి సెకండ్-ఇన్-కమాండ్.
డ్రాగన్'లో సిద్ధార్థ్ గుప్తా
సిద్ధార్థ్ గుప్తా 'డ్రాగన్'లో బాబీ సర్కార్ పాత్రలో నటిస్తున్నారు. ఇతను ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీకి వజీర్.
711
గురు సోమసుందరం
'డ్రాగన్'లో గురు సోమసుందరం కూడా ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాలో ఆయన ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీ అకౌంటెంట్ 'రావు'గా కనిపించనున్నారు.
811
'డ్రాగన్'లో అలెగ్జాండర్ మిజెవ్
రష్యన్ నటుడు, మాజీ ఇంటర్నేషనల్ మోడల్ అయిన అలెగ్జాండర్ మిజెవ్ 'డ్రాగన్'లో రష్యన్ డిస్ట్రిబ్యూటర్ పాత్రలో కనిపించనున్నారు.
911
అత్యంత క్రూరమైన విలన్
సోమాలియాకు చెందిన స్వీయ-ప్రకటిత దేవుడు 'జనరల్ దురాన్' పాత్రలో కనిపిస్తున్న ఈ నటుడి పేరు ఇంకా వెల్లడించలేదు. కానీ ఈ నటుడు పాత్ర చాా క్రూరంగా ఉండబోతున్నట్టు మాత్రం తెలుస్తోంది.
1011
నటుతుజెలో ప్రిన్స్ గ్రూట్‌బూమ్
'డ్రాగన్'లో ఆఫ్రికన్ డిస్ట్రిబ్యూటర్ 'బిలే జెర్సీ' పాత్రలో కనిపించే నటుడి పేరు నటుతుజెలో ప్రిన్స్ గ్రూట్‌బూమ్. ఈయన సౌత్ ఆఫ్రికన్ నటుడు. మొదటి సారి ఇండియన్ సినిమాలో కనిపించబోతున్నారు.
1111
'డ్రాగన్'లో బిమల్ జీత్ ఒబెరాయ్
'డ్రాగన్'లో బిమల్ జీత్ ఒబెరాయ్‌ది కూడా ఒక ముఖ్యమైన పాత్ర. ఆయన 'ట్రైలర్' పాత్రలో కనిపించనున్నారు. అయితే, ఈ పాత్ర గురించి ఎక్కువ వివరాలు వెల్లడించలేదు. ఈ చిత్రానికి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా 2027 జూన్ 11న విడుదల కానుంది.