కట్నం తీసుకున్న వాడు గాడిదతో సమానం అనే ప్రచారంలో ఉంది. కట్నం తీసుకోవడం నేరమని చట్టాలు చెబుతున్నాయి. కానీ అది చట్టాలకే పరిమితం. 99శాతంకట్నాలతోనే పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి. గ్రామీణ ప్రాంతంలో కట్నం డైరెక్ట్ వాడుకపదం. కాస్త సంపన్నుల్లో అది బహుమానం. పేరు ఏదైనా అమ్మాయి పెళ్ళి చేసుకున్నప్పుడుమాత్రం కట్నం ఇచ్చుకోవాల్సిందే. దానికి హీరోలు అతీతం కాదు. సెలబ్రిటీల రేంజ్ చాలా పెద్దది. వారికి కోట్లు అనే పదం లేకుండా పెళ్ళిళ్ళు జరగడం కష్టం. హీరోకి కోట్లల్లోసమర్పించుకోవాల్సిందే. హీరో రేంజ్‌ని బట్టి డౌరీ ఉంటుంది. సూపర్ స్టార్ అయితే పదుల సంఖ్య నుంచి వందల కోట్ల వరకు కట్నం ఉంటుంది. మరి మన టాలీవుడ్ హీరోలుతీసుకున్న కట్నం వివరాలపై ఓ లుక్కేద్దాం.
టాలీవుడ్‌లో మహేష్‌బాబు సూపర్ స్టార్. ఆయనకు ఉన్న ఆస్తి వందల కోట్లు. కృష్ణ వారసత్వంగా వందల కోట్లు పొందాడు. అంతేకాదు తాను చేసుకున్న నమ్రత కూడాఆయనకు వేల కోట్లు కట్నంగా తెచ్చింది.
మహేష్‌బాబు.. నమ్రతని ప్రేమించి పెళ్ళి చేసుకున్నారు. కృష్ణ వీరి పెళ్ళికి ఒప్పుకోకపోవడంతో సీక్రెట్‌గా మ్యారేజ్ పూర్తి చేసుకున్నారు. ఆ సమయంలో వీరికి అయిన ఖర్చు లక్షరూపాయలకు మించి ఉండదు. కానీ ఆమె నుంచి మహేష్ దాదాపు రెండు వేల కోట్లు కట్నంగా(గిఫ్ట్ గా)గా పొందాడు. నమ్రత పేరు మీద ఉన్న వేల కోట్ల ఆస్తి మహేష్ వశంఅయ్యింది. నమ్రత సంపన్న కుటుంబానికి చెందిన అమ్మాయి.
మహేష్ తర్వాత టాలీవుడ్‌లో భారీగా పొందిన వారిలో రామ్‌చరణ్ ఉంటారు. ఆయన అపోలో ఆసుపత్రిల చైర్మెన్ ప్రతాప్ సి రెడ్డి మనవరాలు ఉపాసనని పెళ్లి చేసుకున్నాడు. చెర్రీకోసం ఉపాసన దాదాపు రూ. 350కోట్లు తెచ్చిందని భోగట్టా. వీరి మ్యారేజ్‌కి దాదాపు 15కోట్లు అయ్యింది. వీరిది లవ్ మ్యారేజ్ అని బయట ప్రచారం జరిగినా, అందులోకమర్షియల్ కోణం ఉందనే వార్తలు వినిపించాయి.
ఎన్టీఆర్ ఉన్నారు. యంగ్ టైగర్ కోసం ప్రణీత ఏకంగా రెండు వందల కోట్లు కట్నంగా తెచ్చిందని టాక్. కట్నం తగ్గట్టే మ్యారేజ్ కూడా భారీగా జరిగింది. పెళ్ళికే దాదాపు ఇరవైకోట్ల వరకు అయ్యిందని సమాచారం. ఎన్టీఆర్‌ది అరెంజ్డ్ మ్యారేజ్ కావడం విశేషం.
స్టయిలీష్ స్టార్ అల్లు అర్జున్ కూడా లవ్ అండ్ అరెంజ్డ్ మ్యారేజ్ చేసుకున్నారు. స్నేహరెడ్డితో ఆయనకు వివాహం జరిగింది. వీరి పెళ్ళికి దాదాపు రూ.పది కోట్లు అయ్యిందని,కానీ కట్నంగా మాత్రం వంద కోట్లు బన్నీ పుచ్చుకున్నారని గుసగుసలు వినిపించాయి.
హీరో రేంజ్‌ని బట్టే రెమ్యూనరేషన్స్ అన్నట్టు కట్నాలు కూడా అలానే ఉన్నాయి. గోపీచంద్.. హీరో శ్రీకాంత్ మేనకోడలు రేష్మని మ్యారేజ్ చేసుకోగా, అందుకు ఆమె ఏకంగాఎనిమిది కోట్లు తీసుకొచ్చిందట. వీరికి మ్యారేజ్‌కి కోటిన్నర నుంచి రెండు కోట్ల వరకు ఖర్చు అయ్యిందని టాక్.
కామెడీ చిత్రాల హీరో అల్లరి నరేష్ వివాహం ఈథాని విరూపతో జరిగింది. కట్నంగా విరూప.. నరేష్ కోసం ఐదు కోట్లు తెచ్చిందట. వీరి మ్యారేజ్ ఖర్చు కోటి రూపాయలుఅయ్యిందని తెలుస్తుంది.
నేచురల్ స్టార్ నాని లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. ఫేస్‌బుక్ ద్వారా అంజనా పరిచయం అయ్యింది. ప్రేమని పెళ్లి వరకు తీసుకెళ్లాడు నాని. వీరి మ్యారేజ్‌కి రూ.35లక్షలుఅయ్యిందట. లవ్ మ్యారేజ్ అయినా మూడు కోట్లు తీసుకొచ్చిందట అంజనా.
డైలాగ్ కింగ్ సాయికుమార్ తనయుడు, హీరో ఆది సాయికుమార్ మ్యారేజ్ అరుణతో జరిగింది. అయితే పెళ్ళి బాగానే జరిగింది. కట్నంగా మాత్రం రెండు కోట్లు పొందాడట ఆది.
ఇదిలా ఉంటే వీరిందరికి పవర్ స్టార్ భిన్నం. మూడు పెళ్ళిళ్లు చేసుకున్నా.. కట్నంగా ఒక్క రూపాయి కూడా తీసుకోకపోవడం విశేషం. మొదట ఆయన నందిని పెళ్లిచేసుకున్నాడు. ఆమె నుంచి ఓ పది లక్షల వరకు తీసుకుని ఉంటాడని టాక్. కానీ ఆమెకి విడాకుల సమయంలో రూ. ముప్పై లక్షలు చెల్లించాడు.
ఆ తర్వాత రేణు దేశాయ్‌ని ప్రేమించి పెళ్ళి చేసుకున్నాడు. జీరో కట్నం. కానీ విడాకుల సమయంలో రూ. నలభై కోట్లు చెల్లించాడు. ఇప్పుడు పెళ్ళి చేసుకున్న రష్యాఅమ్మాయిది కూడా లవ్ మ్యారేజే. జీరో కట్నం. ఈ లెక్కన పవన్ ఎదురు కట్నం ఇచ్చాడు. అయితే పవన్ మూడు పెళ్ళిళ్లు చేసుకోవడం వివాదంగా మారుతున్న విషయంతెలిసిందే.(కంటెంట్ ఫ్రమ్సుమన్ టీవీ )