ప్రియాంక చోప్రా ధరించిన నెక్లెస్ ధర అన్ని కోట్లా? ప్రైజ్ తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే..

First Published | May 2, 2023, 3:37 PM IST

గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా (Priyanaka Choprra) ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూనే ఉంటారు.  తాజాగా ఆమె ధరించిన  నెక్లెస్ ధర హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ ధర ఎంతో తెలిస్తే షాక్ అవాల్సిందే.
 

మాజీ విశ్వ సుందరి, స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. కొన్నాళ్ల పాటు బాలీవుడ్ ను ఏలిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం హాలీవుడ్ గడ్డపై తన ముద్రవేసుకుంటోంది. పాప్ సింగ్, ప్రియాంక భర్త నిక్ జోనాస్ (Nick Jonas)తో పెళ్లి తర్వాత బాలీవుడ్ చిత్రాలవైపు  కూడా చూడటం లేదు.  
 

ఈ సందర్భంగా యూఎస్ఏలో జరిగే ఏ ప్రతిష్టాత్మక కార్యక్రమానికైనా ప్రియాంక చోప్రా హాజరవుతూ వచ్చారు. ఇప్పటికే ‘ఆస్కార్’ వేడుకల్లో మెరిసిన విషయం తెలిసిందే. తాజాగా న్యూయార్క్ నగరంలోని మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్‌లో నిర్వహించిన 2023 మెట్ గాలా (Met Gala 2023) ఫ్యాషన్ ఈవెంట్ కు హాజరైంది. 
 


తన భర్త నిక్ కూడా స్టైలిష్ లుక్ లో ఆకట్టుకున్నారు. ప్రియాంక చోప్రా ప్రముఖ డిజైనర్ వాలెంటినో డిజైన్ చేసిన స్టైలిష్ బ్లాక్ గౌన్ లో ఈవెంట్ కు హాజరైంది. అదిరిపోయే లుక్ తో స్టార్ జంటగా అందరినీ ఆకట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. 

ఈ క్రమంలో ప్రియాంక చోప్రాకు సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది. ప్రతిష్టాత్మకమైన అంతర్జాయతీ ఈవెంట్ కోసం  ప్రియాంక చోప్రా ధరించిన నెక్లెస్ ధర ప్రస్తుతం హాట్ టాపిక్ గ్గా మారింది. నిజంగా ఆ ధర తెలిస్లే ఎవ్వరైనా నోరెళ్లబెట్టాల్సిందే. 
 

ప్రియాంక చోప్రా ధరించిన నెక్లెస్ గురించి తెలుసుకుంటే.. బల్గారీకి చెందిన 11.6 క్యారెట్ డైమండ్ నెక్లెస్ ను ధరించింది. ఈ నెక్లెస్ విలువ ఏకంగా రూ.204 కోట్లు ఉంటుందని తెలుస్తోంది. ఈ విషయం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్లు షాక్ అవుతున్నారు. అన్ని కోట్లా అంటూ ఆశ్చర్యపోతున్నారు.

ఈ ఈవెంట్ లో ఇప్పటికే రెండుసార్లు మెరిసింది ప్రియాంక చోప్రా. ఇక మూడోసారి తన  భర్తతో కలిసి హాజరైంది. అలాగే అలియా భట్, రిలయన్స్ అధినేత కూతురు ఇషా అంబానీ కూడా హాజరయ్యారు. ఇదిలా ఉంటే రీసెంట్ గానే ప్రియాంక చోప్రా నటించిన  యాక్షన్ థ్రిల్లర్ సిరీస్ Citadel ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
 

Latest Videos

click me!