బాలయ్య, చిరంజీవి, నాగార్జున, వెంకటేష్‌ కలిసి నటించిన ఏకైక సినిమా ఏంటో తెలుసా?.. ఇండస్ట్రీ మొత్తం దిగింది

Published : Mar 09, 2024, 12:06 PM IST

చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్‌, నాగార్జున కలిసి నటించాలని అభిమానులు ఎంతగానో కోరుకుంటున్నారు. కానీ ఇలాంటి అరుదైన సంఘటన ఆల్‌రెడీ ఓ సినిమాలో చోటు చేసుకుంది.   

PREV
16
బాలయ్య, చిరంజీవి, నాగార్జున, వెంకటేష్‌ కలిసి నటించిన ఏకైక సినిమా ఏంటో తెలుసా?.. ఇండస్ట్రీ మొత్తం దిగింది

90లో ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసిన హీరోలు మెగాస్టార్‌ చిరంజీవి, నందమూరి నటసింహం బాలకృష్ణ, విక్టరీ వెంకటేష్‌, కింగ్‌ నాగార్జున. ఈ నలుగురు ఇండస్ట్రీకి నాలుగు పిల్లర్స్ లా నిలబడ్డారు. వీరితోపాటు మోహన్‌బాబు, జగపతిబాబు, శ్రీకాంత్‌, జేడీ చక్రవర్తి, వేణు తొట్టెంపూడి, అర్జున్‌, రాజేంద్రప్రసాద్‌ వంటి చాలా మంది హీరోలున్నా, ఆ నలుగురు మాత్రం మెయిన్‌ టాప్‌ స్టార్స్ గా రాణించారు. అలాంటి సినిమాలు చేశారు. ఇండస్ట్రీకి నాలుగు కళ్ల మాదిరిగా వ్యవహరించారు. వీరికి మోహన్‌బాబు కూడా మరో పిల్లర్‌ లా నిలబడ్డారు. 
 

26

అయితే ఈ నలుగురు కలిసి నటిస్తే చూడాలని తెలుగు ఆడియెన్స్ డ్రీమ్‌. పలు సందర్భాల్లో ఆ చర్చ తెరపైకి వచ్చింది. కేవలం చర్చగానే మిగిలింది. కానీ ఎప్పుడూ కలిసి నటించలేదు. అయితే కొన్ని సందర్భాల్లో మాత్రం ఇద్దరిద్దరు హీరోలు కలిసి కనిపించారు. ఒక్కో హీరో సినిమాల్లో మరో హీరో మెరవడం జరగింది. కానీ మల్టీస్టారర్‌గా మాత్రం రాలేదు. అయితే ఈ నలుగురు కలిసి కనిపించింది ఓ సినిమా ఉంది. ఇందులో ఓ హీరో మెయిన్‌గా నటించగా, మిగిలిన ముగ్గురు గెస్ట్ లుగా మెరిశారు. 
 

36

చిరంజీవి, నాగార్జున, వెంకీ ఇప్పటి వరకు చాలా సినిమాల్లో గెస్ట్ రోల్స్ చేశారు. అడపాదడపా మెరుస్తూనే ఉన్నారు. ఫ్యాన్స్ ని అలరిస్తూనే ఉన్నారు. కానీ బాలయ్య మాత్రం ఒకే సినిమాలో గెస్ట్ రోల్‌ చేశాడు. అది కూడా నలుగురు కలిసి కనిపించడం విశేషం. ఆ సినిమా ఏంటంటే.. `త్రిమూర్తులు`. వెంకటేష్‌ హీరోగా నటించిన చిత్రమిది. వెంకటేష్‌, అర్జున్‌, రాజేంద్రప్రసాద్‌ హీరోలుగా చేశారు. కె మురళీ మోహన్‌రావు దర్శకత్వం వహించిన ఈ సినిమా 1987లో విడుదలైంది. 

46

ఇందులో చిరంజీవి, బాలయ్య, నాగార్జున గెస్ట్ లుగా మెరిశారు. వీరితోపాటు ఇండస్ట్రీ మొత్తం దిగింది. కృష్ణ, కృష్ణంరాజు, శోభన్‌బాబు, చంద్రమోహన్‌, మురళీ మోహన్‌, పరుచూరి బ్రదర్స్, గొల్లపూడి, పద్మనాభం, విజయశాంతి, రాధ, భాను ప్రియ, రాధికతోపాటు శారద, జయమాలిని, అనురాధ, వై విజయ వంటి వారు గెస్ట్ లుగా మెరిశారు.
 

56

ఇన్నేళ్ల కెరీర్‌లో నలుగురు టాప్‌ స్టార్స్ నటించిన ఒకే ఒక సినిమా `త్రిమూర్తులు`గా చెప్పొచ్చు. ఈ మూవీ బాక్సాఫీసు వద్ద పెద్దగా ఆడలేదు. భారీ కాస్టింగ్‌ ఉన్నా సినిమాలో విషయం లేకపోవడంతో ఆశించిన స్థాయిలో ఆడలేదు. అయితే ఇది హిందీలో వచ్చిన `నసీబ్‌` చిత్రానికి రీమేక్‌. అక్కడ మంచి విజయం సాధించింది. కానీ తెలుగులోనూ అంతగా ఆడలేదు. 
 

66

ఇక ప్రస్తుతం చిరంజీవి.. వశిష్ట దర్శకత్వంలో `విశ్వంభర` చిత్రంలో నటిస్తున్నారు. బాలకృష్ణ `ఎన్బీకే109` చిత్రంలో నటిస్తున్నారు. దీనికి బాబీ దర్శకుడు, బాబీ డియోల్‌ విలన్‌ రోల్‌ పోషిస్తున్నారు. వెంకటేష్‌, నాగార్జున సంక్రాంతికి `సైంధవ్`, `నా సామిరంగ` చిత్రాలతో వచ్చారు. `నా సామిరంగ` ఫర్వాలేదు. `సైంధవ్‌` మూవీ డిజాప్పాయింట్‌ చేసింది. నాగ్‌ ప్రస్తుతం ధనుష్‌ హీరోగా రూపొందుతున్న `కుభేర`లో కీలక పాత్రలో మెరవబోతున్నారు. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories