RRR 2 : ఆర్ఆర్ఆర్ కు సీక్వెల్ రాబోతోంది.. స్టోరీపై మొదలైన చర్చలు.. క్లారిటీ ఇచ్చిన రాజమౌళి!

Published : Nov 13, 2022, 11:33 AM IST

టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం  వహించిన బ్లాక్ బాస్టర్ చిత్రం ఆర్ఆర్ఆర్ (RRR). ప్రపంచ వ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ చిత్రానికి సీక్వెల్ కూడా రాబోతోంది. దీనిపై తాజాగా జక్కన్న కూడా క్లారిటీ ఇచ్చారు.   

PREV
16
RRR 2 : ఆర్ఆర్ఆర్ కు సీక్వెల్ రాబోతోంది.. స్టోరీపై మొదలైన చర్చలు.. క్లారిటీ ఇచ్చిన రాజమౌళి!

దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli) దర్శకత్వంలో వచ్చిన బ్లాక్ బాస్టర్ ఫిల్మ్ ‘ఆర్ఆర్ఆర్’ (RRR). ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ పిరియాడికల్ యాక్షన్ డ్రామా భారీ విజయాన్ని అందుకుంది. పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు దక్కాయి.
 

26

ఇప్పటికీ ఇతర దేశాల్లో స్పెషల్ స్క్రీనింగ్ తో అభిమానులను సంపాదించుకుంటోంది ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం. రీసెంట్ గా జపాన్ దేశంలో ఈ చిత్రం ప్రదర్శించబడింది. ఇందుకోసం జక్కనతో పాటు యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR), మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) ఇటీవల జపాన్ కు ప్రమోషన్స్ నిమిత్తం వెళ్లిన విషయం తెలిసిందే. 
 

36

ప్రస్తుతం యూఎస్ఏలోని చికాగోలో ‘ఆర్ఆర్ఆర్’ స్పెషల్ స్క్రీనింగ్స్ జరుగుతోంది. విదేశీయుల నుంచి ఈ చిత్రానికి విశేష ఆదరణ అందుతోంది. ఇంతటీ ప్రేక్షాదరణ పొందడంతో ‘ఆర్ఆర్ఆర్’కు సీక్వెల్ వస్తే బాగుటుందని.. సినీ ప్రియులు, అభిమానులు కోరుతున్నారు. ఈ క్రమంలో జక్కన్న కూడా RRR2పైనా స్పందించారు. 
 

46

ఆర్ఆర్ఆర్ కు సీక్వెల్ వస్తుందా? అనే అంశంపై పరోక్షంగా వస్తుందనే  ప్రముఖ రచయిత, రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ క్లారిటీ ఇచ్చారు. తాజాగా దర్శకధీరుడు రాజమౌళి కూడా  ఆర్ఆర్ఆర్ సీక్వెల్ పై స్పందించారు. చికాగోలో స్పెషల్ స్క్రీనింగ్స్  జరుగుతున్న క్రమంలో అదిరిపోయే అప్డేట్ అందించారు. 
 

56

RRR2ని కూడా ప్లాన్ చేస్తున్నారా అని అడిగిన ప్రశ్నకు సానుకూలంగా బదులిచ్చారు. జక్కన్న మాట్లాడుతూ.. తన అన్ని సినిమాలకు తండ్రి విజయేంద్ర ప్రసాద్ స్టోరీ అందిస్తుంటారని  తెలిపారు. ఈ క్రమంలో ‘ఆర్ఆర్ఆర్ 2’పైనా తండ్రితో కలిసి  ప్రాథమిక కథా చర్చలు జరుగుతున్నాయని  తెలిపారు. 
 

66

ఆర్ఆర్ఆర్ లో ఉద్యమ వీరులు కొమురం భీం, సీతారామరాజుగా ఎన్టీఆర్, రామ్ చరణ్ వరల్డ్ వైడ్ పాపులర్ అయ్యారు. ఇక దీనికి సీక్వెల్ కూడా రాబోతుందని, అందుకు సంబంధించిన చిన్న అప్డేట్ ఇవ్వడంతో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇక రాజమౌళి లిస్టులో నెక్ట్స్ చిత్రం మహేశ్ బాబుతో ఫిక్స్ అయిన విషయం తెలిసిందే. 

click me!

Recommended Stories