Vyooham VS Chandrababu : ‘వ్యూహం’ రిలీజ్ డేట్ కు చంద్రబాబుకు ఉన్న లింక్ ఏంటో తెలుసా? రివీల్ చేసిన ఆర్జీవీ

First Published | Feb 10, 2024, 7:59 PM IST

సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ్ ‘వ్యూహం’ Vyooham రిలీజ్ సందర్భంగా ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడికి కౌంటర్ ఇచ్చారు. ఈ మూవీ రిలీజ్ డేట్ తోనే ఆయన గతం ఎలా ముడిపడి ఉందో చెప్పుకొచ్చారు. 

డాషింగ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma)  ప్రస్తుతం తెరకెక్కిస్తున్న పొలిటికల్ డ్రామా ‘వ్యూహం’. ఈ చిత్రం మొదటి నుంచి వివాదాలను ఎదుర్కొంటూనే ఉంది. రామ్ గోపాల్ వర్మ సినిమా అంటే ఆ మాత్రం చిక్కులు ఉండటం సహజమే.. కానీ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగిన తర్వాత కూడా ఈ సినిమా వాయిదా పడటం ఇండస్ట్రీలో కొంత చర్చ జరిగింది. 

ఏదేమైనా ఆర్జీవీ దర్శకత్వం వహించిన ‘వ్యూహం’ చిత్రం ఫిబ్రవరి 23న విడుదల కాబోతోంది. సినిమాకు అన్నీ లైన్లు క్లియర్ కావడంతో ఆర్జీవీ వరుస పోస్టులు నెట్టింట సంచలనంగా మారుతున్నాయి. 
 


టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ ను ఉద్దేశించి తీవ్ర కామెంట్లు చేస్తున్నారు. ఇక తాజాగా chandrababuను ఉద్దేశించి సంచలన పోస్టు పెట్టారు. ‘వ్యూహం’ రిలీజ్ డేట్ కు చంద్రబాబు రాజకీయ జీవితానికి ఉన్న లింక్ ను చెప్పుకొచ్చారు. మొత్తం తొమ్మిది పాయింట్లలో వివరించారు. 

చంద్రబాబు గురించి ఆర్జీవీ పోస్టులో.... ‘వైసీపీ పార్టీ నుంచి బాబు లాక్కున్న MLAలు 23 మంది. 2. 2019 ఎన్నికల ఫలితాలు వల్ల తాను ఓడిపోయాను అని తెలుసుకున్న తేదీ 23rd, Babu గెల్చుకున్న ఎమ్మెల్యే స్థానాలు కేవలం 23. 

బాబు అరెస్టయిన తేదీ  9-9-23.. వీటన్నింటిని మొత్తం 23. స్కిల్ డెవలప్మెంట్ కేసులో 2023లో సెప్టెంబర్ 23 వరకూ జ్యూడీషియల్ రిమాండ్ ఇచ్చిన సీబీఐ కోర్టు. బాబు ప్రిజన్  నెంబర్ 7691.. వాటి మొత్తం కూడా 23.

CBN, NTR దగ్గరనుంచి తను లాక్కున్న పార్టీ కి వారసుడిగా చేద్దామనుకుంటున్న లోకేష్ పుట్టింది కూడా 23నే. వ్యూహం సినిమా జగగర్జన ఈవెంట్ జరిగింది 23నే. చివరిగా వ్యూహం సినిమా రిలీజ్ కాబోతోంది కూడా 23నే’. అంటూ చంద్రబాబుకు కౌంటర్ రిలీజ్ డేట్ ను వివరించారు. 
 

Latest Videos

click me!