Krishna Vamsi: దర్శకుడు కృష్ణవంశీ ఇటీవల సినిమా విజయాలు, అపజయాలపై తన దృక్పథాన్ని వెల్లడించారు. సినిమా ఫలితాలు కేవలం దర్శకుడి చేతుల్లోనే ఉండవని, హిట్ అయితే హీరోలు, నిర్మాతలు..
టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్‌గా పేరొందిన కృష్ణవంశీ.. సినిమా జయాపజయాలపై తనదైన శైలిలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ సినిమా ఫలితం విషయంలో దర్శకుడి పాత్ర ఎంత కీలకమో, అదే సమయంలో క్రెడిట్ పంపకాలలో జరిగే వ్యత్యాసాలను కూడా ఆయన కుండబద్దలు కొట్టినట్లుగా వివరించారు.
25
సినిమా హిట్ అవ్వగానే
ఒక సినిమా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించినప్పుడు, అందులో భాగస్వాములైన ప్రతి ఒక్కరూ ఆ విజయం తమ వల్లే సాధ్యమైందని చెప్పుకోవడానికి ఆరాటపడతారని కృష్ణవంశీ అభిప్రాయపడ్డారు. మ్యూజిక్ డైరెక్టర్, హీరో, హీరోయిన్, రచయిత ఇలా అందరూ కూడా సినిమా హిట్ అవ్వగానే తమ వల్లే అయిందని సక్సెస్ క్రెడిట్‌ను పంచుకుంటారన్నారు. కానీ, అదే సినిమా పరాజయం పాలైతే మాత్రం, అందరి వేళ్లు దర్శకుడి వైపే చూపిస్తాయని వాపోయారు.
35
'చక్రం' అపజయంపై..
తన కెరీర్‌లోని సినిమాల విషయానికొస్తే.. హిట్ అండ్ ప్లాఫ్ ఏదైనా కూడా బాధ్యత తనదేనని కృష్ణవంశీ అన్నారు. ముఖ్యంగా ప్రభాస్ హీరోగా వచ్చిన 'చక్రం' సినిమా ఆశించిన విజయం సాధించకపోవడానికి పూర్తి బాధ్యత తనదేనని చెప్పుకొచ్చారు. హీరో బాధ్యత కూడా ఉందని చెప్పడం తప్పని.. ప్రభాస్ కేవలం నా ఆదేశాలను పాటించాడని.. ఆ సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోవడానికి కారణం నేనే అని ఆయన స్పష్టం చేశారు.
థియేటర్లలో ఆడకపోయినా.. టీవీలు, ఓటీటీలలో 'చక్రం' చిత్రం కల్ట్ క్లాసిక్‌గా మారడంపై ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. థియేటర్లలో చూసేటప్పుడు ఉండే అంచనాలు, ఇంట్లో చూసేటప్పుడు ఉండే దృక్పథం వేర్వేరుగా ఉంటాయని ఆయన విశ్లేషించారు. అందుకే చక్రం సినిమాను చెత్త సినిమా అనలేమని, అలా అంటే ప్రేక్షకులు ఒప్పుకోరని పేర్కొన్నారు.
55
హిట్ సినిమా వేరు, మంచి సినిమా వేరు
చివరగా, "హిట్ సినిమా వేరు, మంచి సినిమా వేరు, ప్రజలకు నచ్చిన సినిమా వేరు.. ప్రజలకు నచ్చిన సినిమానే థియేటర్లలో సూపర్ హిట్ అవుతుంది" అంటూ చెప్పుకొచ్చారు. కృష్ణవంశీ చేసిన ఈ వ్యాఖ్యలు సినిమా మేకింగ్‌లోని కష్టనష్టాలను, దర్శకుడిపై ఉండే ఒత్తిడిని ప్రతిబింబిస్తున్నాయని చెప్పొచ్చు.