సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రతని ప్రేమ వివాహం చేసుకోవడం అప్పట్లో పెద్ద సంచలనం. వీళ్ళిద్దరూ వంశీ అనే చిత్రంలో నటించారు. అప్పుడే ప్రేమలో పడ్డారు. కానీ సడెన్ గా పెళ్లి చేసుకున్నారు. అప్పట్లో కృష్ణ.. వాళ్లిద్దరూ ప్రేమించుకున్నారు కాబట్టి పెళ్లి చేశాం అని మీడియా కి తెలిపారు. ప్రస్తుతం మహేష్, నమ్రత అన్యోన్యంగా జీవిస్తున్న సంగతి తెలిసిందే.