యశ్ హీరోగా నటిస్తున్న 'టాక్సిక్' సినిమాలో హీరోయిన్‌గా కియారా అద్వానీని ఎందుకు ఎంపిక చేశారో డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ స్వయంగా మూడు కారణాలు చెప్పారు. ఇంతకీ ఆమె చెప్పిన కారణాలు ఏంటి?
యశ్, కియారా అద్వానీ జంటగా నటిస్తున్న 'టాక్సిక్' సినిమా జూన్ 4న విడుదల కానుంది. ఈ భారీ బడ్జెట్ సినిమాకు కియారాను ఎందుకు హీరోయిన్‌గా తీసుకున్నారో డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ మూడు కారణాలతో వివరించారు.
26
కియారా నటన ప్రత్యేకం..
ఈ సినిమాలో నాడియా పాత్రకు మృదుత్వం, ఆవేశం రెండూ ఉంటాయి. కియారా నటనను చాలా దగ్గరగా గమనించా. ఈ పాత్రకు ఆమెను మించి ఇంకెవరూ లేరనిపించింది. సినిమాలో లాజిక్ కంటే ఎమోషనే ముఖ్యం. అందుకే తర్కాన్ని పక్కనపెట్టి, భావోద్వేగంతో కియారాను ఎంపిక చేశానని ఆమె అన్నారు.
36
నటిస్తున్నట్లు అనిపించదు
కియారా పాత్రలో జీవించే విధానం అద్భుతంగా ఉంటుంది. ఆమె స్క్రీన్‌పై ఉంటే నటిస్తున్నట్లు అనిపించదు, ఆ పాత్రే మన ముందు నిలబడినట్లు ఉంటుంది. ఆర్భాటం లేకుండానే మనసును హత్తుకునే నటి ఆమె. మౌనంగా ఉంటూనే, మనసులో పాత్ర గురించి ఆలోచిస్తూ ఉంటుంది. కొన్నిసార్లు పాత్ర గురించి ఆసక్తిగా అడుగుతుంది. డైరెక్టర్ ఆలోచనలను గ్రహించి, పాత్రలోకి ఒదిగిపోయే నైపుణ్యం ఆమెకుంది.
ఈ అమ్మాయి క్రమశిక్షణ, నిజాయితీ, తన పని తాను చూసుకుపోయే తత్వం నాకు నచ్చిన మరో ముఖ్యమైన అంశం అని డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ ప్రశంసించారు.
56
యశ్ ట్యాక్సిక్ తర్వాత దళపతి విజయ్ జననాయగన్
దళపతి విజయ్ నటిస్తున్న 'జన నాయగన్' సినిమా విడుదలపై ఇంకా స్పష్టత రాలేదు. అయితే, యశ్ 'టాక్సిక్' (జూన్ 4 విడుదల) తర్వాత ఈ సినిమాను రిలీజ్ చేయాలని KVN ప్రొడక్షన్స్ ప్లాన్ చేస్తోంది. విజయ్ పుట్టినరోజైన జూన్ 22న సినిమాను విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.
66
అడ్డంకిగా మారిన ఎన్నికలు
తమిళనాడులో ఏప్రిల్ 23 నుంచి పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికల్లో నటుడు విజయ్ పోటీ చేస్తున్నందున, మే 6 వరకు సినిమాను విడుదల చేయడానికి వీల్లేదు. ఆ తర్వాత వచ్చే ఎన్నికల ఫలితాలు సినిమాపై ప్రభావం చూపే అవకాశం ఉందని చిత్ర బృందం భావిస్తోందట.