ప్రభాస్ ఐ యామ్ సారీ, బ్యాడ్ న్యూస్ చెప్పి హ్యాపీ మూడ్ చెడగొట్టిన స్టార్ ప్రొడ్యూసర్..గొడవ పెట్టుకున్నా..

First Published Apr 19, 2024, 10:01 AM IST

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కెరీర్ బాహుబలితో ఒక్కసారిగా కొత్త మలుపు తీసుకుంది. అంతకు ముందు యూత్ ఫుల్ చిత్రాలు చేసిన ప్రభాస్.. బాహుబలి తర్వాత భారీ పాన్ ఇండియా చిత్రాలు చేస్తున్నాడు. 

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కెరీర్ బాహుబలితో ఒక్కసారిగా కొత్త మలుపు తీసుకుంది. అంతకు ముందు యూత్ ఫుల్ చిత్రాలు చేసిన ప్రభాస్.. బాహుబలి తర్వాత భారీ పాన్ ఇండియా చిత్రాలు చేస్తున్నాడు. ప్రభాస్ కి చాలా మంది ప్రొడ్యూసర్స్ తో మంచి రిలేషన్ ఉంది. అందులో స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఒకరు. 

దిల్ రాజు, ప్రభాస్ కాంబినేషన్ లో మున్నా, మిస్టర్ పర్ఫెక్ట్ లాంటి చిత్రాలు వచ్చాయి. మున్నా చిత్రం డిజాస్టర్ గా నిలిచింది. మిస్టర్ పర్ఫెక్ట్ హిట్ అయింది. అయితే దిల్ రాజు మున్నా మూవీపై చాలా ఆశలు పెట్టుకున్నారట. దిల్, ఆర్య, భద్ర, బొమ్మరిల్లు  లాంటి నాలుగు వరుస బ్లాక్ బస్టర్స్ తర్వాత దిల్ రాజు నిర్మించిన చిత్రం మున్నా. 

ఈ చిత్రం విషయంలో చాలా తప్పులు జరిగాయని దిల్ రాజు అన్నారు. ఒకవైపు బొమ్మరిల్లు షూటింగ్ జరుగుతుండగానే మున్నా మూవీని కూడా ప్రారంభించాం. ఈ చిత్రానికి కొరటాల శివ, మచ్చ రవి రచయితలు. వంశి పైడిపల్లి దర్శకుడు. వంశి నాకు బాగా క్లోజ్. కథలో ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు నాకు నచ్చలేదు. వంశీ అగ్రెసిగ్ గా బిహేవ్ చేసేవాడు. 

డైరెక్టర్ తో గొడవలు జరిగాయి. మ్యూజిక్ డైరెక్టర్ తో కూడాగొడవలు జరిగాయి. మొత్తం రాంగ్ వే లో వెళుతోంది అని అని అనిపించింది. క్లైమాక్స్ గురించి వంశీ ని అడిగితే ఇదే చాలా బావుంది అంటూ బలంగా నమ్మాడు. నాతో ఆర్గుమెంట్ చేశాడు. సరే డైరెక్టర్ కి వదిలేద్దాం అని సైలెంట్ అయిపోయా. సినిమా రిలీజ్ కి రెడీ అయింది. 

అంతకు ముందే బొమ్మరిల్లు భారీ హిట్ అయింది. దీనితో మున్నాపై అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. రిలీజ్ కి ముందు నా ఫ్రెండ్స్ చూడాలంటే ప్రివ్యూ వేశాను. సెకండ్ హాఫ్ విషయంలో వాళ్ళ నుంచి నెగిటివ్ రెస్పాన్స్ వచ్చింది. సినిమా రిలీజ్ అయింది. సుదర్శన్ లో సినిమా చూశా. నాకు అర్థం అయిపోయింది. వెంటనే ప్రభాస్ దక్కరికి వెళ్ళా. 

అప్పటికే కొంత రిపోర్ట్స్ వస్తున్నాయి. ప్రభాస్ కి సినిమా హిట్ అనే రాంగ్ ఇన్ఫర్మేషన్ వెళ్ళింది. దీనితో ప్రభాస్ హ్యాపీ మూడ్ లో ఫ్రెండ్స్ తో ఉన్నాడు. నేను వెళ్లి..ప్రభాస్ ఐ యామ్ సారీ.. నీకు హిట్ ఇవ్వలేకపోయాను అని చెప్పా. దీనితో ప్రభాస్ ఏంటి భయ్యా అందరూ బావుందని అంటున్నారు కదా అని అన్నాడు. లేదు ప్రభాస్ సినిమా హిట్ అయితే కాదు. 

నువ్వు మెంటల్ గా ప్రిపేర్ అవ్వు. ఏదైనా మిరాకిల్ జరిగితే మన అదృష్టం. సినిమా అయితే మాగ్జిమమ్ యావరేజ్ అవుతుంది అని చెప్పేశా. మేము అనుకున్న స్థాయిలో ఆ చిత్రం రాణించలేదు. కానీ ఆ అంచనాల వల్ల 9 సెంటర్స్ లో 100 రోజులు ఆడింది అని దిల్ రాజు అన్నారు. ఈ చిత్రంలో ప్రభాస్ కి జోడిగా ఇలియానా నటించిన సంగతి తెలిసిందే. 

click me!