టాలీవుడ్ నిర్మాతలపై జరుగుతున్న ఐటీ దాడులు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఇటీవల కాలంలో ఎక్కువ బిజినెస్ చేసిన దిల్ రాజు, మైత్రి నిర్మాతలని ఐటీ అధికారులు టార్గెట్ చేశారు. దిల్ రాజు నిర్మాణంలో సంక్రాంతికి 2 చిత్రాలు విడుదలయ్యాయి. గేమ్ ఛేంజర్ నిరాశ పరచగా, సంక్రాంతికి వస్తున్నాం చిత్రం మాత్రం వెంకటేష్ కెరీర్ లోనే అత్యధిక వసూళ్లతో దూసుకుపోతోంది. గత మూడు రోజులుగా దిల్ రాజు ఇల్లు, ఆఫీస్ లలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.