‘థ్యాంక్యూ’ ఫేల్యూర్ అని ముందే తెలుసా.? నాగచైతన్య షాకింగ్ కామెంట్స్.!

Published : Aug 03, 2022, 07:52 PM ISTUpdated : Aug 03, 2022, 07:53 PM IST

అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య (Naga Chaitanya) రీసెంట్ ‘థ్యాంక్యూ’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం డిజాస్టర్ గా నిలవడం పట్ల చైతూ షాకింగ్ కామెంట్స్ చేశారు.   

PREV
15
‘థ్యాంక్యూ’ ఫేల్యూర్ అని ముందే తెలుసా.? నాగచైతన్య షాకింగ్ కామెంట్స్.!

‘లవ్ స్టోరీ’, ‘బంగార్రాజు’ మూవీతో మంచి సక్సెస్ ను అందుకున్నాడు అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్య (Naga Chaitanya). మరో హిట్ ను తన ఖాతాలో వేసుకోవాలని రొమాంటిక్ ఫిల్మ్ ‘థ్యాంక్యూ’ (Thank You)తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కానీ ఈ చిత్రం ఆశించినంత ఫలితాలనివ్వలేదు. 
 

25

అక్కినేని నాగచైతన్య - గ్లామర్ బ్యూటీ రాశీ ఖన్నా జంటగా నటించిన ఈ చిత్రం గత నెల జూలై 22న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలిరోజే ఈ చిత్రానికి బాక్సాఫీస్ వద్ద చుక్కెదురైంది. అత్యంత దారుణమైన వసూళ్లతో డిజాస్టర్ గా నిలిచింది. కేవలం రూ.కోటీ మాత్రమే రాబట్టింది. ఆ తర్వాత రోజుల్లో ఘోర కలెక్షన్స్ తోనే సరిపెట్టుకుంది.
 

35

అయితే ఈ చిత్రం డిజాస్టర్ పై తాజాగా నాగచైతన్య షాకింగ్ కామెంట్స్ చేశారు. తను నటించిన హిందీ ఫిల్మ్ ‘లాల్ సింగ్ చడ్డా’ ప్రమోషన్స్ లో భాగంగా పలు ఇంటర్వ్యూలో పాల్గొంటున్నారు. తాజాగా చైతూ ‘థ్యాంక్యూ’ మూవీ డిజాస్టర్ పై స్పందించారు.
 

45

థ్యాంక్యూ మూవీ గురించి మాట్లాడుతూ..  ‘నిజంగా చెప్పాలంటే ఇది షాకింగ్ మరియు భయానకంగా ఉంది. లాల్ సింగ్ చడ్డా కారణంగా... థ్యాంక్యూ మూవీని ప్రాసెస్ చేయడానికి నాకు ఎక్కువ సమయం లేదు. కానీ నేను చూసినంత వరకు, రచనలోనూ కొన్ని లోపాలు ఉన్నాయి.’ అని షాకింగ్ గా కామెంట్స్ చేశారు. 
 

55

బాలీవుడ్ లో మరికొద్ది రోజుల్లో రిలీజ్ కాబోతున్న ‘లాల్ సింగ్ చడ్డా’పై నాగచైతన్య ఆశలు పెట్టుకున్నారు. ఈ మూవీలో ఆర్మీ సోల్జర్ బాలరాజు బోడీ పాత్రలో నటించారు. ఈ రోల్ కోసం తన పూర్తి గెటప్ నే మార్చేశాడు. ఆగస్టు 11న హిందీతో పాటు తెలుగు ఇతర భాషల్లోనూ రిలీజ్ కానుంది. తెలుగులో ఈ చిత్రాన్ని మెగాస్టార్ చిరంజీవి సమర్పిస్తున్నారు. 

Read more Photos on
click me!

Recommended Stories