Dhurandhar 2 Collection: ధురంధర్‌ 2 మూవీ మొదటి రోజు వసూళ్లు.. అన్ని సినిమా రికార్డులు బద్దలు

Published : Mar 19, 2026, 05:31 PM IST

Dhurandhar 2 Collection: రణ్‌వీర్‌ సింగ్‌ నటించిన `ధురంధర్‌ 2` మూవీ బ్లాక్‌ బస్టర్‌ టాక్‌తో దూసుకుపోతుంది. ఇది ఇండియన్‌ సినిమా రికార్డులను బద్దలు కొట్టబోతుందని ట్రేడ్‌ వర్గాలు చెబుతున్నాయి. 

PREV
15
ధురంధర్‌ 2 కలెక్షన్లు

ట్రేడ్ ట్రాకింగ్ వెబ్‌సైట్ sacnilk.com ప్రకారం, ఆదిత్య ధర్ డైరెక్షన్‌లో వచ్చిన  ధురంధర్‌ 2 మూవీ మొదటి రోజు సాయంత్రం 4 గంటలకే రూ.45.14 కోట్లు కలెక్ట్ చేసింది. దీంతో 2026లో వచ్చిన హిందీ సినిమాల్లో ఇదే అతిపెద్ద ఓపెనర్‌గా నిలిచింది. సన్నీ డియోల్ 'బార్డర్ 2' రికార్డును ఇది బ్రేక్ చేసింది.

25
'బార్డర్ 2' మొదటి రోజు కలెక్షన్ ఎంత?

సన్నీ డియోల్ నటించిన 'బార్డర్ 2' సినిమా 2026 జనవరి 23న రిలీజైంది. అనురాగ్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మొదటి రోజు సుమారు రూ.30 కోట్లు సంపాదించింది. కానీ 'దురంధర్‌ 2` సినిమా మధ్యాహ్నం 3 గంటలకే ఈ మార్క్‌ను దాటేసింది. ఫైనల్ లెక్కలు వచ్చేసరికి 'బార్డర్ 2' కంటే రెట్టింపు వసూళ్లు రావచ్చని అంచనా వేస్తున్నారు. 

35
`ధురంధర్‌ 2' మొత్తం కలెక్షన్ ఎంత?

ఈ స్పై యాక్షన్ డ్రామా `ధురంధర్‌ 2` మార్చి 19 సాయంత్రం 4 గంటల వరకు భారతదేశంలో రూ.88.14 కోట్లు వసూలు చేసింది. ఓపెనింగ్ డేకి ముందు, మార్చి 18న పెయిడ్ ప్రీమియర్లు వేశారు. ఈ ప్రీమియర్ల కోసం 12,292 షోలు కేటాయించగా, వాటి ద్వారా సినిమాకు దాదాపు రూ.43 కోట్లు వచ్చాయి.

45
`ధురంధర్‌: ది రివెంజ్' మొదటి రోజు అడ్వాన్స్ బుకింగ్

అడ్వాన్స్ బుకింగ్స్ విషయానికొస్తే, 'ధురంధర్‌ : ది రివెంజ్' బ్లాక్ సీట్లతో కలిపి దాదాపు రూ.40.30 కోట్లు వసూలు చేసింది. మొదటి రోజు కోసం 17,000 కంటే ఎక్కువ షోలకు గాను 9.50 లక్షలకు పైగా టిక్కెట్లు అమ్ముడయ్యాయని సమాచారం.  

55
ప్రపంచవ్యాప్తంగా 200 కోట్లకు పైగా వసూలు చేసిన ధురంధర్‌

ట్రేడ్ రిపోర్టుల ప్రకారం, రణవీర్ సింగ్‌తో పాటు సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, ఆర్. మాధవన్, సారా అర్జున్ వంటి స్టార్లు నటించిన ధురంధర్‌ః ది రివెంజ్' సినిమా ప్రీ-సేల్స్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇది మొదటి వారాంతానికి సంబంధించిన లెక్క. ఇందులో ఒక్క ఓవర్సీస్ మార్కెట్ నుంచే రూ.80 కోట్లు రావడం విశేషం. మొత్తంగా ఈ మూవీ మొదటి రోజు వసూళ్లలో అన్ని ఇండియన్‌ మూవీస్‌ రికార్డులను బ్రేక్‌ చేయబోతుందని అంటున్నారు. మరి ఎంత వరకు రాబడుతుందో చూడాలి. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories