పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన `ఉస్తాద్ భగత్ సింగ్` మూవీ మొదటి రోజు కలెక్షన్ల వివరాలు వచ్చాయి. ఇది `హరి హర వీరమల్లు`ని టచ్ చేయలేకపోయింది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన `ఉస్తాద్ భగత్ సింగ్` ఉగాది పండుగ సందర్భంగా విడుదలై ఆడియెన్స్ నుంచి మిశ్రమ స్పందన రాబట్టుకుంటోంది. పక్కా మాస్ మసాలా, కమర్షియల్ మూవీ అనే టాక్ వచ్చింది. పవన్ అభిమానులకు నచ్చేలా దర్శకుడు హరీష్ శంకర్ ఈ మూవీని రూపొందించారు. అభిమానులు ఎంజాయ్ చేస్తున్నారు. పవన్ డాన్సులు, ఫైట్లు, కామెడీని వాళ్లు తెగ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే బాక్సాఫీసు వద్ద మాత్రం ఈ మూవీ డీసెంట్ ఓపెనింగ్స్ నే రాబట్టుకుంటోంది. ఆశించిన స్థాయిలో రాలేదని తెలుస్తోంది. మరి ఈ చిత్రానికి మొదటి రోజు ఎంత కలెక్షన్లు వచ్చాయనేది చూస్తే.
26
ఉస్తాద్ భగత్ సింగ్ మొదటి రోజు కలెక్షన్లు
`ఉస్తాద్ భగత్ సింగ్` మూవీ మొదటి రోజు దాదాపు ఆరవై నుంచి డెబ్బై కోట్ల వరకు అంచనా వేశారు ట్రేడ్ పండితులు. కానీ ఇప్పుడు ఊహించిన దానికంటే తక్కువగానే వచ్చినట్టు తెలుస్తోంది. ఈ చిత్రానికి మొదటి రోజు రూ.52కోట్లు వచ్చినట్టు బాలీ మూవీరివ్యూ, ట్రాక్ టాలీవుడ్ వంటి సైట్లు ప్రకటించాయి. ఇందులో తెలుగు రాష్ట్రాల్లో దాదాపు రూ.34కోట్లు వచ్చాయి. ఎవర్సీస్, రెస్ట్ ఆఫ్ ఇండియా కలుపుకొని రూ.52కోట్లు వచ్చినట్టు సమాచారం. అయితే ఇది ఊహించిన దానికంటే తక్కువే అని చెప్పొచ్చు. పవన్ ఫ్లాప్ మూవీ `హరి హర వీరమల్లు` కంటే ఇది తక్కువ కావడం గమనార్హం.
36
`ఉస్తాద్ భగత్ సింగ్`.. ఓజీలో సగం కూడా చేయలేదా?
పవన్ కళ్యాణ్ చివరగా `ఓజీ` చిత్రంతో ఆడియెన్స్ ని అలరించారు. గ్యాంగ్ స్టర్ కథతో రూపొందిన ఈ చిత్రం మొదటి రోజు ఏకంగా రూ.140కోట్లకుపైగా వసూళ్లని రాబట్టింది. ఆ మూవీకి ఉన్న క్రేజ్, బజ్ నేపథ్యంలో భారీ ఓపెనింగ్స్ ని చేయగలిగింది. కానీ ఆ స్థాయిలో రాబట్టడంలో `ఉస్తాద్ భగత్ సింగ్` వెనకబడింది. అయితే `ఓజీ` పాన్ ఇండియా స్కేల్‌లో విడుదలయ్యింది. `ఉస్తాద్ భగత్ సింగ్` రీజినల్ ఫిల్మ్ గా విడుదలయ్యింది. దీంతో ఆ తేడా కనిపిస్తుందని చెప్పొచ్చు. కాకపోతే `ఓజీ`లో సగం కూడా రాలేదని టాక్.
అయితే `ఉస్తాద్ భగత్ సింగ్` మూవీ పవన్ డిజాస్టర్ మూవీ `హరి హర వీరమల్లు` ఓపెనింగ్స్ ని కూడా టచ్ చేయలేకపోయింది. పవన్ నటించిన తొలి పాన్ ఇండియా మూవీ `హరి హర వీరమల్లు`. ఈ చిత్రం గతేడాది జులైలో విడుదలైంది. మొదటి రోజు దాదాపు రూ.70కోట్లు వసూలు చేసింది. మంచి వసూళ్లని రాబట్టింది. కానీ `ఉస్తాద్ భగత్ సింగ్` కేవలం రూ.52కోట్లకే పరిమితం కావడం గమనార్హం. అయితే ఇవి అధికారిక లెక్కలు కావు. చిత్ర యూనిట్ అఫీషియల్‌గా ఈ వసూళ్లని ప్రకటించే ఛాన్స్ ఉంది.
56
`ఉస్తాద్ భగత్ సింగ్` పై `ధురంధర్ 2 ప్రభావం
ఏదేమైనా `ఉస్తాద్ భగత్ సింగ్` మూవీకి మొదటి నుంచి పెద్దగా బజ్ లేదు. పైగా దర్శకుడు ఇది రెగ్యూలర్ కమర్షియల్ మూవీ అని చెప్పడంతో ముందే ఆడియెన్స్ కి అర్థమయ్యింది. ఇది రొటీన్ మూవీ అని. అది ఈ సినిమా ఓపెనింగ్స్ పై ప్రభావం పడిందని చెప్పొచ్చు. దీనికితోడు అదే రోజు `ధురంధర్ 2` కూడా విడుదల కావడం, దానికి పూర్తిగా పాజిటివ్ టాక్ రావడం కూడా అది `ఉస్తాద్ భగత్ సింగ్` కలెక్షన్లని ప్రభావితం చేసిందని చెప్పొచ్చు.
66
ఉస్తాద్‌ని సెలబ్రేట్ చేసుకోబోతున్న పవన్ అభిమానులు
ఇక పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన `ఉస్తాద్ భగత్ సింగ్` మూవీలో శ్రీలీలా, రాశీఖన్నా హీరోయిన్లుగా నటించగా, రావు రమేష్, పార్థిబన్, కేఎస్ రవికుమార్, గౌతమి వంటి వారు కీలక పాత్రలు పోషించారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం ఉగాది పండుగ సందర్భంగా గురువారం(మార్చి 19)న విడుదలైన విషయం తెలిసిందే. పవన్ లైనప్‌లో ఉన్న చివరి చిత్రమిది. ఆ తర్వాత ఏ సినిమా చేస్తాడు? ఎప్పుడు చేస్తాడనేది క్లారిటీ లేదు. దీంతో ఈ మూవీని అభిమానులు ఎక్కువగా సెలబ్రేట్ చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.