5 రోజుల్లో 800 కోట్లు.. ధురంధర్ 2 సినిమా చూసి రజినీకాంత్ ఏమన్నారంటే?

Published : Mar 24, 2026, 12:52 PM IST

రణ్‌వీర్ సింగ్ సినిమా 'ధురంధర్ 2' బాక్సాఫీస్ దగ్గర తుఫాన్ సృష్టిస్తోంది. బాలీవుడ్‌లోనే కాదు, సౌత్ ఇండస్ట్రీ నుంచి కూడా ఈ సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు. తాజాగా ఈసినిమా చూసిన  సూపర్ స్టార్ రజినీకాంత్ ఏమన్నాడంటే? 

PREV
15
'ధురంధర్ 2'పై రజినీకాంత్ ప్రశంసల వర్షం
సూపర్ స్టార్ రజినీకాంత్ 'ధురంధర్ 2' చూశాక X (ట్విట్టర్) లో రివ్యూ ఇచ్చారు. "ఏం సినిమా... ధురంధర్ 2!!! ఆదిత్య ధర్ బాక్సాఫీస్ కా బాప్!!! రణ్‌వీర్ సింగ్, చిత్ర బృందానికి అభినందనలు. ప్రతి భారతీయుడు తప్పక చూడాల్సిన సినిమా. జై హింద్" అని పోస్ట్ చేశారు.
25
'ధురంధర్ 2'కు సౌత్ ఇండస్ట్రీ ఫిదా

రజినీకాంత్‌ కంటే ముందే చాలా మంది సౌత్ స్టార్లు 'ధురంధర్ 2'పై ప్రశంసలు కురిపించారు. వీరిలో డైరెక్టర్ ఎస్.ఎస్. రాజమౌళి, సూపర్ స్టార్లు అల్లు అర్జున్, నాగార్జున, వెంకటేష్ దగ్గుబాటి, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, కాజల్ అగర్వాల్ వంటి వారు ఉన్నారు. 

35
బాక్సాఫీస్ వద్ద 'ధురంధర్ 2' రికార్డుల మోత
రణ్‌వీర్ సింగ్ 'ధురంధర్ 2' సినిమా రికార్డు స్థాయిలో వసూళ్లు రాబడుతోంది. ఈ చిత్రం మొదటి సోమవారం సుమారు 65 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసింది. దీంతో ఇండియాలో మొత్తం వసూళ్లు దాదాపు 519.12 కోట్లకు, ప్రపంచవ్యాప్తంగా 829.76 కోట్ల రూపాయలకు చేరాయి.
45
ప్రీమియర్లతోనే 'ధురంధర్ 2' సంచలనం

'ధురంధర్ 2' మార్చి 19, 2026న థియేటర్లలో విడుదలైంది. ఒక రోజు ముందు, అంటే మార్చి 18న, పెయిడ్ ప్రీమియర్లు వేశారు. ఆ రోజు ఈ సినిమాను సుమారు 12,735 షోలలో ప్రదర్శించారు. ఇండియన్ సినిమాలో అతిపెద్ద పెయిడ్ ప్రీమియర్ రికార్డు సృష్టిస్తూ 43 కోట్ల రూపాయలు వసూలు చేసింది. విశేషమేమిటంటే, ప్రీమియర్ల రోజు కొన్ని షోలు రద్దయ్యాయి కూడా. 

55
'ధురంధర్ 2' టార్గెట్ 2000 కోట్ల క్లబ్
ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన రణ్‌వీర్ సింగ్ 'ధురంధర్ 2' దూకుడు చూస్తుంటే, త్వరలోనే గ్లోబల్ ర్యాంకింగ్స్‌లో పైకి వెళ్తుందని అంచనా వేస్తున్నారు. ఈ సినిమా టార్గెట్ ఇప్పుడు వరల్డ్‌వైడ్ 2000 కోట్ల క్లబ్. ప్రస్తుతం ఈ క్లబ్‌లో ఆమిర్ ఖాన్ నటించిన 'దంగల్' మాత్రమే ఉంది.
Read more Photos on
click me!

Recommended Stories